ఎన్టీఆర్‌ని చూసి గర్వంతో ఉప్పొంగిపోతున్నాను: రాజమౌళి

0Rajamouli-and-NTRఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించిన జై లవకుశ చిత్రం కొద్ది సేపటి క్రితం థియేటర్స్‌లోకి వచ్చింది. జై నామస్మరణతో థియేటర్స్ మారు మ్రోగుతుండగా, ఎన్టీఆర్ నటనికి అభిమానులు జై..జై..లు పలుకుతున్నారు. అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అయ్యారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్‌ని ఆకాశానికి ఎత్తాడు. తార‌క్‌.. నా హృదయం అపారమైన గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఎన్టీఆర్ నటనకి పదాలు లేవు.. జైజై అంటూ జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో యమదొంగ చిత్రం తెరకెక్కగా, ఇందులో జూనియర్ ఎన్టీఆర్‌ని పవర్‌ఫుల్ రోల్ లో చూపించిన సంగతి తెలిసిందే. త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ కూడా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. జై లవకుశ చిత్రం 2400 థియేటర్స్‌లో విడుదల కాగా ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది.