రాజమౌళి మళ్లీ ప్రభాస్‌తోనే?

0Prabhas-Rajamouliరాజమౌళి తదుపరి చిత్రంలో హీరో ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. వచ్చే ఏడాదికి గానీ రాజమౌళి నెక్స్‌ట్‌ మూవీ మొదలయ్యేలా లేదు. బాహుబలితో నేషనల్‌ మార్కెట్‌ రావడంతో ఈసారి తీసే చిత్రాన్ని కూడా భారతదేశం అంతటా విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అయితే అందుకోసం నేషనల్‌ అప్పీల్‌ వున్న హీరో కావాలి.

రాజమౌళి తీసేది తెలుగు సినిమా కనుక ఇటు ఇక్కడ స్టార్‌ అయి వుండీ, అటు నార్త్‌లోను ఆకట్టుకునే వాడు కావాలి. అందుకే ప్రభాస్‌తోనే రాజమౌళి తదుపరి చిత్రం చేయబోతున్నాడని గుసగుసలు మొదలయ్యాయి. ‘బాహుబలి’ చేస్తున్నప్పుడే త్వరలోనే మరో సినిమా కలిసి చేద్దామని ఇద్దరూ ఒక మాట అనుకున్నారట.

అయితే అది ఎప్పుడనేది ఇద్దరూ డిసైడ్‌ కాలేదు కానీ, ప్రస్తుతం రాజమౌళి వున్న సంకట స్థితిలో ప్రభాస్‌తో సినిమానే బెటర్‌ అని అతని క్యాంప్‌ ఆలోచిస్తోందని, ప్రభాస్‌ కూడా సుముఖంగానే వున్నాడు కనుక అదే పట్టాలెక్కిస్తే బెటర్‌ అని అనుకుంటున్నారట. బాహుబలి కాంబినేషన్‌లో సినిమా అనేసరికి హైప్‌ దానంతట అదే వచ్చేస్తుంది కనుక ఇది మం