ఐటెమ్ భామల కోసం రాజమౌళి వేట!

0దర్శకధీరుడు రాజమౌళి తదుపరి ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ – రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ఆ చిత్రంలోని ఇతర తారల కోసం వేట మొదలైంది. కథానాయికలుగా ఇద్దరికి చోటుంటుంది కాబట్టి ఆ ఇద్దరు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ భామలే ఖరారు కావొచ్చని – రాజమౌళి వాళ్లని సంప్రదించే పనిలో ఉన్నారని ప్రచారం సాగింది. ఆ ప్రచారంలో ఉన్న సమంత మొదలుకొని ఇతర కానీ కథానాయికలు ఎవ్వరూ కూడా ఆ విషయాన్ని ధృవీకరించలేదు. దాంతో జక్కన్న బాలీవుడ్ భామలపైనే దృష్టిపెట్టినట్టు చెప్పుకొన్నారు.

అయితే తాజాగా ఆయన బాలీవుడ్ వైపు చూస్తున్నది హీరోయిన్ల కోసం కాదట. ఐటెమ్ భామల కోసమట. సినిమాలో ఓ కీలకమైన ఐటెమ్ పాట ఉంటుందట. ఆ పాటలో బాలీవుడ్ భామ నటిస్తే బాగుంటుందని ఆయన భావిస్తూ పలువురు కథానాయికల్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. హీరోయిన్ల పాత్రలకి మాత్రం దక్షిణాది భామల్నే ఖరారు చేయవచ్చని తెలిసింది. నవంబరులో మొదలుకానున్న ఈ సినిమా కోసం ఆగస్టులోపు క్యాస్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాలనే ప్రయత్నంలో ఉన్నారట. ఈ సినిమాలో నటించే కథానాయకులు రామ్ చరణ్ – ఎన్టీఆర్ లు కొన్నాళ్లపాటు బల్క్ డేట్లు ఇవ్వాలని రాజమౌళి కోరాడట. అందుకు ఇద్దరూ కూడా ఒప్పుకొన్నట్టు తెలిసింది. కథానాయికల్ని కూడా అలాగే అడగొచ్చనీ అందుకు ఒప్పుకొనేవాళ్లకే ఇందులో చోటుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.