రాజమౌళి మాటతో నమ్మకం పెరిగిందన్న రానా!

0rana-daggubatiవిభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ రానా ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో ఆయన ‘ఘాజీ’ సినిమా చేశాడు. 1971లో జరిగిన ఇండియా – పాకిస్థాన్ యుద్ధం .. ‘జలాంతర్గామి’ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను వచ్చేనెల 17వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి రానా మాట్లాడాడు. తాను ఈ సినిమాకి సైన్ చేసినట్టు చెప్పగానే చాలామంది తనని పిచ్చివాడిలా చూశారనీ, రాజమౌళి మాత్రం అభినందించాడని అన్నాడు. ఆయన మాటలతో ఈ ప్రాజెక్టుపై తనకి ఎంతో నమ్మకం కలిగిందని చెప్పాడు. ఇక కరణ్ జోహార్ కి ఈ సినిమా చూపించినప్పుడు, హిందీలో తాను డిస్ట్రిబ్యూట్ చేస్తానని అన్నాడని చెప్పాడు. ఆ మాటతో ఈ సినిమాపై తన నమ్మకం మరింతగా బలపడిందని అన్నాడు.