కాబోయే కోడలు గాయని అంట!

0హీరో కం విలన్ జగపతిబాబు అన్న కుమార్తె పూజా ప్రసాద్ను రాజమౌళి అలియాస్ జక్కన్న కుమారుడు కార్తికేయ పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. నిన్నటిరోజున నిశ్చితార్థం అంటూ వార్త దావానలంటా వెబ్ ని చుట్టేసింది. కార్తికేయ ప్రేమలో పడ్డాడు. ప్రేమించిన ప్రాణసఖినే పెళ్లాడుతున్నాడు.. నేడే నిశ్చితార్థం అంటూ వార్తలొచ్చాయి. ఇంతకీ జక్కన్న కోడలు – జగపతి సోదరుని కూతురు అర్హత ఏంటి?

కార్తికేయ మాంచి టెక్నీషియన్. సినిమా 24 శాఖలతో పరిచయం ఉన్నావాడు.. పైగా పబ్లిసిటీ – వీడియో ఎడిటింగ్ వంటి వాటిలో అనుభవం ఉన్నవాడు. ఆ రకంగా డాడ్ జక్కన్న సంస్థానంలో పని చేస్తూ కోట్లలోనే ఆర్జిస్తున్నాడు. సినిమాల నిర్మాణం – క్రీడల్లో పెట్టుబడులు పెట్టడం – హోటల్ చైన్ నిర్వహణ అంటూ బోలెడన్ని వ్యాపకాలతో బాగానే ఆర్జిస్తున్నాడు. అలాంటివాడికి కాబోయే వైఫ్ అంటే అంతో ఇంతో ఉండాలి కదా? అని పూజా గురించి ఆరాలు తీస్తున్నారు.

పూజా మొదటి అర్హత తనో మంచి భక్తురాలు. ఫిలింనగర్ దైవసన్నిధానంలో తాత విబి.రాజేంద్రప్రసాద్ ఈవెంట్లలో తనే కర్తకర్మక్రియ. వెల్ ఎడ్యుకేటెడ్ గాళ్. అంతేకాదండోయ్ పూజాలోని వేరొక క్వాలిటీ తెలిసింది. తనో మంచి గాయని కూడా. కర్నాటిక్ సంగీతవిధ్వాంసురాలట. `మాధవ కేశవ….` అంటూ రవీంద్రభారతి వేదికపై పూజా పాడిన భక్తిగీతం ఎంతో ఆకట్టుకుంది. ఆ వీడియోలో పూజా స్టేజ్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. ఎలానూ సెలబ్రిటీ ఫ్యామిలీనే – పైగా ఆ ఇద్దరికీ ఈడు-జోడు కుదిరింది. కాబట్టి ఇంట్లో వాళ్లు ఓకే చేశారని భావించవచ్చు. ఈ ఏడాది చివరిలో వివాహం ఉంటుందని తెలుస్తోంది.