జక్కన్న కుమారుడి ఎంగేజ్ మెంట్!

0టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ప్రేక్షకులకు సుపరిచితుడే. మగధీర చిత్రం నుంచి తన తండ్రి సినిమాల్లో చేదోడువాదోడుగా ఉంటున్నాడు కార్తికేయం. `ఈగ` సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ గా `యుద్ధం శరణం` సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా `బాహుబలి-2`కు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పనిచేసిన కార్తికేయ ఆల్ రౌండర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగేందుకు కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కార్తికేయకు సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ రోజు కార్తికేయ ఎంగేజ్ మెంట్ జరగబోతోంది. కొంతకాలంగా తాను ప్రేమిస్తోన్న అమ్మాయినే కార్తికేయ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

సినిమాలతో పాటు కార్తికేయ వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టాడు. ఒక రెస్టారెంట్ కు సహ యజమానిగా ఉన్న కార్తికేయ….తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ లో నల్గొండ ఈగల్స్ కబడ్డీ టీమ్ కు ఓనర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే కార్తికేయ …రాజమౌళి సొంత కొడుకు కాదన్న సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితం జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి సతీమణి రమా రాజమౌళి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయినప్పటికీ వారి కుటుంబంలో కార్తికేయను రాజమౌళి సొంత కొడుకులాగే చూస్తారని రమ చెప్పారు. రాజమౌళికి – కార్తికేయక మధ్య మంచి అనుబంధం ఉందని పలు వేదికలపై స్పష్టమైన సంగతి తెలిసిందే.