టెర్రరిస్టుల కంటే మనమే పెద్ద శత్రువులం -రాజమౌళి

0ఈరోజు జరిగిన ట్రాఫిక్ ఎవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి.. చాలారోజులు తరువాత సినిమాల గురించి కాకుండా ఇతర విషయాల గురించి మంచి స్పీచ్ ఇచ్చాడు. ఎప్పుడూ సినిమాలే కాకుండా రాజమౌళి ఇలా సొసైటీకోసం ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు. అయితే ట్వీట్లకు పరిమితమైన రాజమౌళి వాయిస్ ఇప్పుడు చాలా ఘాటుగా సొసైటీ బాగుపడాలంటే మనుషులు మారాలంటూ చెప్పడంతో.. ఆడియన్స్ స్టన్ అయ్యారు.

”టెర్రరిస్ట్ ఎటాక్ లో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువమంది చనిపోతున్నారు. కాని టెర్రరిస్ట్ ఎటాక్ జరిగినప్పుడు అందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఆవేశపూరితులం అయిపోతున్నాం. ఎందుకంటే అక్కడ శత్రువు బయట దేశం వాడు కాబట్టి. కాని రోడ్డు ప్రమాదాల్లో శత్రువులు ఎవరో కాదు మనమే. టెర్రిరిస్ట్ ఎటాక్ లో రెండొందలమంది చనిపోతే.. రోడ్డు ప్రమాదంలో లక్షకు పైనే చనిపోతున్నారు. కాబట్టి మనం రోడ్డు మీద జరిగే ప్రమాదలపైన ఫోకస్ పెట్టాలి” అంటూ రాజమౌళి తనదైన స్టయిల్లో స్పీచ్ ఇచ్చాడు. బన్నీ స్పీచ్ బాగుందని పొగిడిన రాజమౌళి.. భలే మాటొకటి అన్నాడులే. ”మేం దర్శకులం బాగా మాట్లాడం. హీరోలు బాగా మాట్లాడతారు. అందుకే కదా హీరోలను సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తాం” అన్నాడు రాజమౌళి. ఇకపోతే తాగినప్పుడు బన్నీ చెప్పినట్లు ఎవరన్నా బకరాను చూసుకుని డ్రైవింగ్ చేయమనాలి లేదంటే క్యాబ్ లో ఇంటికెళ్ళాలి తప్పించి.. తాగి నడపొద్దని చెప్పాడు. తాను తాగడు కాబట్టి అంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేనని అన్నాడు.

ఇకపోతే బన్నీ తీసిన ‘ఐ యామ్ చేంజ్’ షార్ట్ ఫిలిం చాలా బాగుందని.. ఎప్పుడూ పర్సనల్ గా కలసి అభినందించడం కుదర్లేదని.. అందుకే ఇప్పుడు చెబుతున్నానని తెలిపాడు. అలాగే అల్లు అర్జున్ కూడా అందరం గర్వించదగిన సినిమా అయిన బాహుబలి తీసి గొప్ప పనిచేశారంటూ కితాబిచ్చాడు.