బలం పెంచాలంటున్న జక్కన్న

0

rajamouli-jakkannaతెలుగు చిత్రసీమలో ప్రభాస్ కటవుట్ కి తిరుగు లేదు. ఆ శాల్తీని చూసి ఏదైనా నమ్మేయాల్సిందే.  వందమందిని కాదు…  తెరపై వేయిమందిని ఒకేసారి ఓడించినా నమ్మేస్తాం. ఆయితే ఇప్పుడు అంత భారీ కటవుట్ కూడా మన జక్కన్నకి ఆనడం లేదట. `బాహుబలి` అన్న పేరుకు సార్థకం చేకూర్చేలా ప్రభాస్ తెరపై కనిపించాలని చిత్రదర్శకుడు యస్.యస్.రాజమౌళి చెబుతున్నాడట.

అందుకోసం ప్రభాస్ ని ఇంకో యాభై కిలోలు పెరగమని చెబుతున్నాడట. ఇప్పటికే భారీ దేహంతో కనిపిస్తున్న ప్రభాస్ ఇంకో యాభై కిలోలు పెరిగితే ఎలా ఉంటాడో ఊహించుకోండి. కానీ సినిమాలోని కంటెంట్ దృష్ట్యా ప్రభాస్ అలా కనిపించాల్సిందేనట. తెరపై ప్రభాస్ చేతపట్టే ఆయుధమే ఆరు అడుగులు ఉంటుందట. అంటే అంత హైట్ ఉన్న ఆయుధం చేతపట్టాలంటే కథానాయకుడు ఎలా ఉండాలో అర్థం చేసుకోవచ్చు.  బాహుబలుడు ఎంత బలశాలిగా కనిపిస్తే పాత్ర అంత ఎఫెక్టివ్ గా కనిపిస్తుందని రాజమౌళి చెబుతున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.

Tags : Rajamouli wants Prabhas To Put up some more Weight,Prabhas and Rajamouli Bhaubali,Prabhas look in Bahubali,prabhas weapon in Bahubali movie
Please Read Disclaimer