ఇది చాలా దారుణం అంటున్న రాజమౌళి

0SS-Rajamouliబాహుబలి 2 రిలీజ్ కి కేవలం రెండు వారాల టైం మాత్రమే ఉన్నా జక్కన్న టీం కి టెన్షన్ తగ్గడం లేదు సరి కదా అంతకంతకు పెరుగుతూ పోతోంది. కారణం ఇప్పుడు ఈ సినిమా కర్ణాటకలో విడుదల కావడం గురించి కమ్ముకున్న నీలి నీడలు. సత్యరాజ్ ఎప్పుడో కర్ణాటక ప్రజలను ఉద్దేశించి అన్న వ్యాఖ్యలను పట్టుకుని ఇప్పుడు నిరసన రూపంలో ఈ సినిమాను నిషేధిస్తామని పలు సంఘాలు ఇప్పటికే ప్రకటించిన నేపధ్యంలో పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో మౌన ముద్ర వహించడంతో ఆర్కా మీడియా సంస్థకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ముందు సినిమాను కొంటాను అన్న డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నాడు. సినిమా ఒక్క ఆట ఆపినా తనకు వచ్చే నష్టం కొట్లలో ఉంటుంది కాబట్టి జంకుతున్నారు. దీంతో కర్ణాటక మొత్తం స్వంతంగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది ఆర్కా సంస్థ. ఇది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ అందుకు తగ్గట్టు ప్రిపరేషన్ మొదలు పెట్టినట్టు టాక్.

దీని గురించి తాజాగా రాజమౌళి స్పందించాడు. తొమ్మిదేళ్ళ క్రితం అన్న మాటలను పట్టుకుని దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమాపై చూపడం దారుణమని అన్నాడు. ఈ మధ్య కాలంలో సత్యరాజ్ సినిమాలు ఎన్నో రిలీజ్ అయితే కేవలం తమ సినిమా మీదే ఎందుకు చూపుతున్నారు అనేది ఆయన ప్రశ్న. అసలు నిర్మాత, దర్శకుడు కాని సత్యరాజ్ ఇందులో వేసింది ఒక చిన్న పాత్ర అని స్పష్టం చేస్తున్నాడు. రాజమౌళి ప్రశ్నలో న్యాయం ఉంది. తన కొడుకుని పరిచయం చేస్తూ తను ముఖ్య పాత్రలో సత్యరాజ్ నటించిన దొర సినిమా కర్ణాటకలో రిలీజ్ అయినప్పుడు ఎటువంటి అడ్డంకి రాలేదు. మరి ఇప్పుడు మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న.ఇందులో చాలా కుట్ర కోణం ఉందని, కన్నడ సినిమాలు ఆడటం లేదు కాబట్టి వాటిని కాపాడుకోవడం కోసం ఇలా దొడ్డి దారిలో తెలుగు సినిమాల మీద కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు ప్రభాస్ ఫాన్స్. కాటమ రాయుడు రిలీజ్ టైం లో పునీత్ రాజ్ కుమార్ సినిమా ‘రాజకుమార’ థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కుంది. అందుకే బాహుబలి ని టార్గెట్ చేసారా అన్న డౌట్ నిజం అయ్యే అవకాశం ఉంది. మరి అసలు హీరో సత్యరాజ్ దీని గురించి ఏమైనా స్పందిస్తాడో లేదో చూడాలి.