ఐపీఎల్ పై రజనీకాంత్ విమర్శలు

0ఐపీఎల్ 2018 గ్రాండ్ గా ప్రారంభమైయింది. ఈ సీజన్ ని ఎంజాయ్ చేయడానికి క్రికెట్ ఫ్యాన్స్ మంచి జోష్ లో వున్నారు. ఐతే ఇలాంటి నేపథ్యంలో ఐపీయల్ పై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు,

ఓ వైపు రాష్ట్రంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతూ, కావేరీ నదీ జలాల కోసం నిరసనలు తెలియజేస్తున్న వేళ, ఐపీఎల్ క్రికెట్ పోటీలు ఎందుకంటూ రజనీకాంత్ తీవ్ర విమర్శలు చేశారు.

ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన, కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న వేళ, క్రికెట్ పోటీలు జరుగుతూ ఉండటం తనకు ఇబ్బందిని, చిరాకును తెప్పిస్తోందనిఅన్నారు. ఈ పోటీల్లో క్రీడాకారులు ప్రజల నిరసనలకు మద్దతుగా కనీసం నల్ల బ్యాడ్జీలు ధరించి ఆడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.