సీనియర్ హీరో నెక్ట్స్ ‘అ’తడితోనే

0కెరీర్ ముగిసిపోతోందని అనుకుంటున్న టైంలో పి.ఎస్.వి. గరుడవేగ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు సీనియర్ హీరో రాజశేఖర్. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన టైం కావడంతో తరవాత ఏ సినిమాకూ ఇంతవరకు రాజశేఖర్ ఓకే చెప్పలేదు.

ఇన్నాళ్లకు రాజశేఖర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టే ఉన్నాడు. నాని ప్రొడ్యూస్ చేసిన ‘అ!’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ మధ్యనే సోషల్ మీడియాలో లోకి ఎంటరయిన ఈ సీనియర్ హీరో ఈ విషయం స్వయంగా పోస్ట్ చేశాడు. తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ న్యూస్ షేర్ చేశాడు. ‘‘నా తరవాత ప్రాజెక్టు గురించి ఇప్పుడు చెప్పగలను. అది అసమ్ గా ఉంటుంది’’ అంటూ అ అనే మాటను హైలైట్ గా పెట్టాడు. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ప్రాజెక్టు సెట్టయిందనే విషయం తేలిపోయింది.

రాజశేఖర్ తో సినిమా స్టార్ట్ చేయడానికి ప్రశాంత్ వర్మ చాలారోజులుగా ప్రయత్నిస్తున్నాడు. ఈలోగా అతడికి క్వీన్ సినిమా తెలుగు రీమేక్ చేసే ఛాన్స్ వచ్చింది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి మొదట నీలకంఠ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు. తరవాత అతడు ఈ ప్రాజెక్టు వదిలేయడంతో ఆ ప్లేస్ లోకి ప్రశాంత్ వర్మ వచ్చి చేరాడు. క్వీన్ అయ్యాక రాజశేఖర్ మూవీ షూటింగ్ స్టార్టయ్యే అవకాశముంది.