శమంతకమణి లో మహేష్ బాబు..!

0




mahesh-babu-in-shamantakamaniటాలీవుడ్ యంగ్ హీరోస్ సుధీర్ బాబు, నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్లు హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా శమంతకమణి. భలే మంచి రోజు ఫేం శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నలుగురు హీరోలకు సమానమైన మరో కీలక పాత్ర ఉందట.. ఆ పాత్ర పేరే మహేష్ బాబు. కీలకమైన క్యారెక్టర్ కోసం సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ను తీసుకున్నారు.

తాజాగా రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్కు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ను గురువారం రిలీజ్ చేయనున్నారు. భవ్యక్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.