42 ఏళ్లుగా మీ గుండెల్లో ఒదిగానంటే!

0

42 ఏళ్ల కెరీర్లో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేశాను. అయితే ఆ నలుగురు తర్వాత ఏం చేయాలి? అనే కన్ఫ్యూజన్ ఎదుర్కొన్నా .. ఏదైనా గొప్ప సినిమా చేశాక బ్లాంక్ నెస్ ఉంటుంది. అంతకన్నా మంచి సినిమా చేయాలి. అంతకంటే మంచి కాన్సెప్టు తో సినిమాలు చేశాను. ఇప్పుడు అలా కుదిరింది గాబట్టే బేవార్స్ చిత్రంలో నటించాను.. అని అన్నారు నటకిరీటి రాజేంద్రప్రసాద్. బేవార్స్ సామాజిక సందేశాన్ని ఎంతో హ్యూమర్తో కలిపి తీర్చిదిద్దిన సినిమా అని తెలిపారు.

తండ్రి – పిల్లల మధ్య కోణం ఆ నలుగురులో ఒక రకంగా చూపారు. ఈ సినిమాలో ఇంకో కోణం. అసలు తల్లిదండ్రుల బాధ్యతలేంటి? పిల్లల బాధ్యతలేంటి? ఆడపిల్లలపై అత్యాచారాలు ఎందు వల్ల జరుగుతున్నాయి? ఈ పరిస్థితి ఎందుకొచ్చింది లాంటి విషయాల్ని ఎంతో సహజమైన కామెడీతో చక్కని సందేశం అందిస్తూ ఈ చిత్రం తెరకెక్కించారు. చావునే కామెడీగా రాసుకున్న ప్రతిభ ఉన్న దర్శకుడి పనితనం చూస్తారు.

సమకాలీన తండ్రి సమాజంలో ఎలా ఉండాలి? ఇలా ఉండాలా.. ఇలాగే ఉండాలి అన్న రూల్ ఉందా? వేలి ముద్రలు మారినట్టు ప్రతి ఒక్కరూ ఒక్కోలా ఉంటారు. వారి వారి సన్నివేశాన్ని బట్టి మనుషులు ఉంటారు. ఒక మంచి సినిమా.
చిన్న సినిమా మనుగడ కష్టంగా ఉన్నా మంచి సినిమాలు ఆడుతున్నాయి. ఈయన మంచి సినిమా తీశారు. ఇప్పుడు చిన్న సినిమాలు తీసేవాళ్లు మంచి సినిమానే తీయాల్సిన సన్నివేశం వచ్చింది. ఈ సినిమా కథ నచ్చి చేశాను.. అని రాజేంద్రుడు తెలిపారు.

పాత్రల మీద ఆర్టిస్టుల ప్రభావం ఉంటుంది. ఆర్టిస్టుల మీద పాత్రల ప్రభావం ఉంటుంది. ఆ రెండిటినీ చేసి చూపించాం మేం. రఘురామ్ – ప్రొఫెసర్ – పుణ్య స్త్రీ పాత్ర – ఆ నలుగురు పాత్ర ఇవన్నీ అలా విభిన్నమైనవి. రఘురామ్ 64 వయసు వాడు. కానీ రాజేంద్ర ప్రసాద్ కాదు కదా? కానీ ఆ పాత్రలో ప్రవేశించి మ్యాజిక్ చేశాం. ఇలా ఎన్నో సంగతులు ఉంటాయి. బేవార్స్ సినిమాలోనూ అలాంటి విలక్షణతను చూస్తారు నా పాత్రలో. ఈ సినిమాని ఆదరిస్తారనే భావిస్తున్నాం.. అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు
Please Read Disclaimer