రజనీ 2.ఓ టీజర్ లీక్

0సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా 2.ఓ.కి ఊహించిన షాక్ తగిలింది. శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 2.ఓ. ఈ సినిమా టీజర్ అధికారికంగా విడుదల కాకముందే సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

విదేశాల్లో ప్రదర్శించిన సమయంలో ఎవరో మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేసిన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ లీక్‌ పై స‍్పందించిన చిత్రయూనిట్ తాము టీజర్‌ అధికారికంగా రిలీజ్‌ చేయలేదని ప్రకటించారు. రోబో సినిమాకు సీక్వల్‌ గా తెరకెక్కుతున్న 2.ఓను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ నెగెటివ్‌ రోల్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాపైద దేశవ్యాప్తంగా భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.