సూపర్ స్టార్ సెట్స్ పైనే రాళ్ళేశారు

0

స్టార్ హీరోలతో సినిమా చేసేటప్పుడు అందులోనూ అవుట్ డోర్ షూటింగ్ అంటే ఒకటికి పది జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిక్కులు ఇబ్బందులు తప్పవు. ఇంతకు ముందు రంగస్థలం గోదావరి జిల్లాల్లో ప్లాన్ చేస్తే అభిమానుల తాకిడి తట్టుకోలేక ఆఖరికి హైదరాబాద్ లోనే సెట్ వేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అదే వర్క్ అవుట్ అయ్యింది కూడా. తాజాగా సూపర్ స్టార్ రజనికాంత్ దర్బార్ కు సైతం ఇలాంటి చిక్కే వచ్చి పడింది.

కథ ప్రకారం కొన్ని కీలకమైన సన్నివేశాలను కాలేజీ లొకేషన్ లో తీస్తున్నారు. సహజత్వం కోసం కొందరు విద్యార్థులను కూడా అందులో పాల్గొనేలా ప్లాన్ చేశారు. ఇక్కడే వచ్చింది అసలైన చిక్కు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్న ట్రెండ్ లో షూటింగ్ జరుగుతున్నంత సేపు ఎవరో ఒకరు ఫోటోలు వీడియోలు తీస్తూ బయటికి సోషల్ మీడియా ద్వారా లీక్ చేస్తున్నారు. ఇవి కాస్తా వైరల్ కావడంతో దర్శకుడు మురుగదాస్ షాక్ తిన్నారు

దీంతో షూటింగ్ స్పాట్ లో నిబంధనలను స్ట్రిక్ట్ చేశారు. కఠినంగా అమలు చేయడం మొదలుపెట్టారు. దీంతో అత్యుత్సాహం చూపిస్తున్న విద్యార్థులను కట్టడి చేసేందుకు టీం మెంబెర్స్ కాస్త కటువుగా ప్రవర్తించారు. దీంతో మా కాలేజీకి వచ్చి మమ్మల్నే బెదిరిస్తారా అంటూ ఆగ్రహం చెందిన విద్యార్థులు సెట్ పైకి రాళ్ళ వర్షం కురిపించారట.

ఇలా అయితే కష్టమని వేరే లొకేషన్ చూసుకుంటే మీకే చెడ్డ పేరు వస్తుందని మురుగదాస్ కాలేజీ యాజమాన్యానికి చెప్పడంతో ప్రస్తుతం ఏం చేయాలా అనే దిశగా చర్చలు జరుగుతున్నాయట. ఒకరో ఇద్దరినో అంటే కంట్రోల్ చేయొచ్చు కాని మరీ ఇలా వందల సంఖ్యలో ఉండే స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయడం అయ్యేపని కాదు. అందుకే వేరే ప్రత్యాన్మయం దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం
Please Read Disclaimer