దర్బార్ లీక్ ఫోటోల హంగామా ఆగట్లేదే

0

క్రేజ్ ఉండే సినిమాలకు క్రేజ్ అసలే లేని సినిమాకు తేడా ఒకటే. క్రేజ్ ఉండే సినిమాలకు ఫస్ట్ లుక్.. టెన్త్ లుక్.. ఇంటర్ లుక్ రిలీజ్ చేయాల్సిన పనేలేదు. లీకయిన పిక్స్ ఆ పని చేసేస్తాయి. ఇక డై హార్డు ఫ్యాన్స్ ఉంటారు కదా.. వారు అసలు లుక్కులను తలదన్నేలా తమ అభిమాన హీరోల పోస్టర్లు రెడీ చేసి నెటిజనులను మాయలో పడేస్తారు. కొందరైతే ఇంకా ముందుకెళ్ళి టీజర్లు.. ట్రైలర్లు కూడా తయారు చేస్తారు. ఇక క్రేజ్ లేని సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందంటే.. అధికారికంగా రిలీజ్ చేసినా.. ఫిలిం యూనిట్ వాళ్ళు.. పీఆర్వోలు కలిసి ఆహా ఓహో అనుకోవాల్సిందే కానీ ప్రేక్షకులు వాటిని ఏమాత్రం పట్టించుకోరు.

సూపర్ స్టార్ రాజనీకాంత్ సినిమాలు ఎప్పుడు మొదటి కేటగిరీలో ఉంటాయి. ఇప్పటికే రజనీ – మురుగదాస్ సినిమాకు సంబంధించి చాలా పిక్స్ లీక్ అయ్యాయి. వైరల్ అయ్యాయి. ఇక ఫ్యాన్స్ మెడ్ పోస్టర్లకు లెక్కే లేదు. రెండ్రోజుల క్రితం ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ‘దర్బార్’ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జోరుగా సాగుతుంది. షూటింగ్ లొకేషన్ నుండి మరోసారి కొన్ని పిక్స్ లీకయ్యాయి.

ఒక ఫోటోలో సూపర్ స్టార్ రజనీ గ్రే కలర్ టీ షర్ట్ ధరించి తనదైన స్టైల్ లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. మరో పిక్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార బ్లాక్ కలర్ బోర్డర్ ఉండే వైట్ కలర్ శారీలో చాలా అందంగా కనిపిస్తోంది. తలకు బన్ తో కొప్పు కట్టి రజనీకి తగిన జోడీ అనిపిస్తోంది. మరో ఫోటోలో రజనీ కాంత్.. కమెడియన్ యోగిబాబు ఇద్దరూ నివేద థామస్ తో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఫోటోలో రజనీ గ్రే కలర్ టీ షర్ట్ పై ఒక జాకెట్ ధరించి యమా స్టైలిష్ గా ఉన్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు మామూలు మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. మీరు ఒకసారి చూసేయండి.
Please Read Disclaimer