అభిమానం అనే పిచ్చి ఇలా ఉంటుంది

0కోలీవుడ్ సూపర్ స్టార్ రాజినీకాంత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా సూపర్ స్టార్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోలే రజినీకాంత్ సినిమా వస్తోంది అంటే తప్పుకుంటారు. బాలీవుడ్ ఖాన్ లు అందరూ తలైవా కు పిచ్చ ఫ్యాన్స్. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. మరి అలాంటి సూపర్ స్టార్ తో ఒక్క ఫోటో దిగితే ఆ ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం.

కానీ ఓ తమిళ యువకుకుడు మాత్రం చాలా హార్డ్ గా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఎంతలా అంటే ఇక ప్రశాంతంగా చచ్చిపోతాను అనేంతలా అతను చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు అతను చేసిన ట్వీట్ ఏంటంటే.. ఈ రోజు (30-05-2018) ఉదయం తలైవర్ ఇంటి నుంచి వెళుతుండగా ఎయిర్ పోర్ట్ వరకు వెళ్లాను. అయితే ఫాలో అవుతోన్న సమయంలో తలైవర్ నన్ను చూసి వెంటనే కార్ ఆపేశారు. దీంతో “తలైవా ఒకే ఒక్క ఫోటో కావాలి తలైవా” అని అనడంతో ఆయన” తప్పకుండా ఖన్నా” అని జవాబు ఇవ్వడం ఆనందాన్ని ఇచ్చిందని లక్ష్మణ్ అనే అభిమాని వివరించాడు.

ఆయనతోదిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇప్పుడు నేను ప్రశాంతంగా చనిపోతాను అని ట్వీట్ పెట్టడం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. దీంతో కొందరు ఈ ఫోటోను చూసి అభిమానం అనే పిచ్చి ఇలా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.