రజనీ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఇదిగో ప్రూఫ్‌!

0


సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల ఉన్నఫలంగా అమెరికాకు వెళ్లడం ఆయన అభిమానులను కొంత గందరగోళానికి గురిచేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కొంత ఆందోళన రేపింది. అయితే, రజనీకాంత్‌ మామూలు మెడికల్‌ చెకప్‌ కోసమే అమెరికా వెళ్లారు. అమెరికాలో ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. అంతేకాదు తీరిక సమయాన్ని ఆస్వాదిస్తున్నారు కూడా. అందుకు ప్రూఫ్‌ ఇదేనంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ వీడియోలో రజనీ ఫెరారీలో ప్రయాణిస్తూ సెల్ఫీ తీసుకున్నట్టు కనిపిస్తోంది. నవ్వుతూ రజనీ చాలా హుషారుగా ఈ వీడియోలో కనిపించారు. అన్నట్టు రజనీ తీసుకున్న తొలి సెల్ఫీ వీడియో ఇదేనని తెలుస్తోంది. ఈ వీడియోలో రజనీ డ్రైవింగ్‌ సీటులో కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతూ ’నేను రెడ్‌ బటన్నీ ప్రెస్‌ చేస్తే.. వీడియో వస్తుంది కదా’ అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. గత నెల 28న కూతురు ఐశ్వర్యతో కలిసి అమెరికా వెళ్లిన రజనీ ఈ నెల రెండోవారంలో తిరిగివచ్చే అవకాశముందని తెలుస్తోంది.