రజినీకాంత్ మాయ ఏపాటిదో చూడండి..

0సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా పట్టాలెక్కింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఆయన తీయబోయే తాజా సినిమా రెగ్యూలర్ షూటింగ్ జూన్ 7 నుంచి మొదలైంది. ప్రస్తుతం ఉత్తరభారతంలోని క్యూరిసెంగ్ ప్రాంతంలోని హిల్ స్టేషన్ లో సమీపంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కథలో భాగంగా కొండలు కోనలు.. హిల్ స్టేషన్లలో ప్రస్తుతం షూటింగ్ జరుపుతున్నారు. అందులో భాగంగానే రజినీకాంత్ క్యూరిసెంగ్ ప్రాంతంలోని అల్లిటా రిసార్ట్ రూమ్ నంబర్ 3లో పదిరోజులుగా ఉంటున్నారు..

రజినీకాంత్ ఆ విల్లాలో ఉన్నాడని తెలిసి ఆయన అభిమానులు అక్కడికి వచ్చి చూసి వెళుతున్నారట.. రజినీ గొప్పతనం తెలిసి రిసార్ట్ ఓనర్లు కూడా రజినీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారట.. ప్రస్తుతం ఆ రిస్టార్ పేరు రజినీకాంత్ విల్లాగా మారిపోయింది. ఇంకా కొద్దిరోజులు అక్కడే షూటింగ్ జరుపుతుండడంతో రజినీకాంత్ ఆ రిసార్ట్ లో ఉంటాడట.. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో రజినీకాంత్ పక్కన హీరోయిన్ గా చేస్తోంది. తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. వచ్చే డిసెంబర్ లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.