కమలానికి…..రజనీ ‘కాంత్’

0తలైవా అంటే ఎవరు అని అడిగీతే కొంతమందికి తెలియక పోవచ్చు……..అదే రజనీకాంత్ ఎవరు అని అడిగితే ప్రశ్న పూర్తి కాక ముందే తమిళ సూపర్ స్టార్ అని వెంటనే సమాధానం వస్తుంది. రజనీకాంత్ కు దక్షిణాదిలోనే కాదు ప్రపంచమంతా కూడా వీరాభిమానులు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రజనీకాంత్ రాజకీయాలలోకి వస్తారని ఆయన అభిమానులు ఎదురు చూసారు. ఈ సస్పేన్స్ కు తెర దించుతూ తాను రాజకీయాలలోకి వస్తున్నానని ఆయన ప్రకటించారు . ఈ ప్రకటన ఒక సంచలనమే అయ్యింది. రజనీకాంత్ రాజకీయాలలోకీ వస్తానని ప్రకటించనప్పటికి ఆయన తన పార్టీ పేరుగాని – పార్టీ ఎజేండా గురించి ఎక్కడ చర్చించ లేదు. రాబోయే రోజులలో ఆయన వ్యూహం ఏమిటా అని అంతట అసక్తి నెలకొంది.

అయితే రజనీకాంత్ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షాను పలుమార్లు కలవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రజనీకాంత్ అమిత్ షాతో ఏడుసార్లు భేటి అయినట్లు సమాచారం. 2019వ సంవత్సరంలో జరగబోయే ఎన్నికలలో రజనీకాంత్ భారతీయ జనతా పార్టీతో కలసి ప్రయాణం చేయబోతున్నారని రాజకీయ విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు.. తమిళనాడులో రజనీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ ఎవరికీ తెలియంది కాదు. రజనీకాంత్ స్వతంత్ర అభ్యర్దిగా పోటి చేసినప్పటికి ఆ‍యన గెలుపు తథ్యం అని అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా రజనీ భారతీయ జనతా పార్టీతో కలసి పోటి చేయాలనుకుంటున్నారని వినికిడి. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు వచ్చినప్పుడు రజనీకాంత్తో భేటీ అయిన విషయం విదితమే ఆ తర్వాత తమిళ బిజీపీ నేతలు రజనీని తమ పార్టీలోకి చేరామంటూ ఆహ్వానించారు. అయితే ఈ కలియికపై అటు భారతీయ జనతా పార్టీగాని ఇటు రజనీకాంత్గాని ఎటువంటి ప్రకటన చేయాలేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీతో – రజనీకాంత్ కలిస్తే కనుక తమిళనాడులో మంచి మెజారిటీ వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ ఆచీతూచీ వ్యవహరిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ ను రంగంలోకి దింపింది. మోహన్ లాల్ ను తిరువనంతపురం లోక్ సభ టిక్కట్టు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నట్లు సమాచారం.