కమల్ ది గ్రేట్ – ఆ తర్వాతే నేను : రజినీ

0

యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ నటుడిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. ఏ నటుడు చేయనటువంటి పాత్రలను పోషించడంతో పాటు – విభిన్నమైన గెటప్స్ లో ఆకట్టుకున్న కమల్ హాసన్ యూనివర్శిల్ స్టార్ అయ్యాడు. కమల్ కేవలం నటుడిగానే కాకుండా సినిమాకు సంబంధించిన అన్ని రంగాల్లో కూడా అనుభవం ఉన్న వ్యక్తి. హీరోగానే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా తనకంటూ ఇప్పటికే ఒక గుర్తింపు దక్కించుకున్న కమల్ హాసన్ పై తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసలు కురిపించడం ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో మరియు మీడియాలో ఆసక్తికరంగా మారింది.

తాజాగా రజినీకాంత్ నటించిన ‘2.ఓ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. శంకర్ దర్శకత్వంలో దాదాపు 550 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ‘2.ఓ’ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు రజినీకాంత్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు విషయాల గురించి మాట్లాడటంతో పాటు – కమల్ హాసన్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. కమల్ ది గ్రేట్ ఆయన తర్వాతే నేను అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు.

కమల్ గురించి రజినీకాంత్ మాటల్లో.. నేను సినిమా పరిశ్రమలో అడుగు పెట్టే సమయానికి కమల్ హాసన్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. నేను కూడా కమల్ హాసన్ సినిమాలను ఎక్కువగా చూసేవాడిని. సినిమాలనే కాకుండా ఏ పని చేసినా కూడా అందులో పర్ ఫెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి కమల్ చేస్తారు. అంతగా ఇన్వాల్వ్ అయ్యే వారిని నేను చూడలేదు. సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత నేను ఒక సారి కమల్ హాసన్ బండిపై ఎక్కాను. ఆ సమయంలో నన్ను నేను నమ్ముకోలేక పోయాను. నేను నిజంగానే కమల్ హాసన్ బండి ఎక్కానా అనుకున్నాను. ఆ అనుభవం నాకు చాలా కాలం పాటు సంతోషాన్ని ఇచ్చింది. కమల్ తరహాలో నేను స్టార్ డంను దక్కించుకున్నాను ఆయనలాగే నాకు ఫ్యాన్స్ అయ్యారు. అయినా కూడా కమల్ ను నేను మించి పోయాను అని మాత్రం అనడం సబబు కాదు. కమల్ ఎప్పటికి ది గ్రేట్. ఆ తర్వాతే నా స్థానం అన్నాడు.

ఒక సూపర్ స్టార్ అయ్యి ఉండి సాటి హీరో గురించి రజినీకాంత్ ఇలా మాట్లాడటం ఆయన గొప్పదనం అంటూ రజినీకాంత్ అభిమానులు అంటున్నారు. రజినీకాంత్ కామెంట్స్ పై కమల్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
Please Read Disclaimer