బుర్కా వేసుకుని కోర్టులో లొంగిపోయిన రాఖీ సావంత్

0rakhi-sawantవివాదాస్పద నటి రాఖీ సావంత్ బుర్కా వేసుకుని వచ్చి పంజాబ్ కోర్టులో లొంగిపోవడంతో న్యాయస్థానం ఆమెను మందలించి షరతులతో కూడిన జామీను మంజూరు చేసింది. రాఖీ సావంత్ ను అరెస్టు చెయ్యాలని శుక్రవారం లూథియాన కోర్టు రెండో సారి అరెస్టు వారెంట్లు జారీ చేసింది.

రామయణం గురించి, మహర్షి వాల్మీకి గురించి అవహేళనగా మాట్లాడిన రాఖీ సావాంత్ మీద పంజాబ్ లోని లూథియానలో కేసు నమోదు అయ్యింది. కేసు నమోదు అయినా నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు అన్నట్లు రాఖీ సావంత్ ఇంతకాలం ప్రవర్తించారు.

ఓ టీవీ షో కార్యక్రమంలో రెచ్చిపోయి పిచ్చపిచ్చగా మాట్లాడిన రాఖీ సావంత్ నోరు అదుపులో పెట్టుకోకుండా రామయణం గురించి, మహర్షి వాల్మీకీని అవహేళన చేస్తూ మాట్లాడింది. టీవీ షో కార్యక్రమం వీక్షించిన వారు రాఖీ సావంత్ మీద మండిపడ్డారు. అయినా ఆమె మాత్రం క్షమాపణలు చెప్పలేదు.

మహర్షి వాల్మీకిని అవహేళన చేస్తూ మాట్లాడిన రాఖీ సావంత్ మీద పంజాబ్ లోని లూథియానలో కేసు నమోదు అయ్యింది. లూథియాన న్యాయస్థానంలో కేసు విచారణకు వచ్చింది. అయితే ఒక్క విచారణకు కూడా రాఖీ సావంత్ హాజరుకాలేదు.

విచారణకు హాజరు కాకపోవడంతో లూథియాన న్యాయస్థానం మార్చి 9వ తేదీన రాఖీ సావంత్ కు జామీను రహిత వారెంట్లు జారీ చేసింది. ఏప్రిల్ మొదటి వారంలో రాఖీ సావంత్ ను అరెస్టు చెయ్యడానికి పంజాబ్ పోలీసులు ముంబై వెళ్లారు.

పంజాబ్ పోలీసులు ముంబై వచ్చారని తెలుసుకున్న రాఖీ సావంత్ ఎస్కేప్ అయ్యింది. ఆమె కోసం ముంబైలో పలు ప్రాంతాల్లో గాలించిన పంజాబ్ పోలీసులు చివరికి ఒట్టి చేతులతో తిరిగి వెళ్లిపోయారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్న రాఖీ సావంత్ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ఒళ్లంతా చూపిస్తూ యోగా చేసి రచ్చరచ్చ చేసింది..

పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న రాఖీ సావంత్ ముందస్తు జామీను మంజూరు చెయ్యాలని ఏప్రిల్ 17వ తేదీన లూథియాన కోర్టులో అర్జీ సమర్పించింది. రాఖీ సావంత్ అర్జీని తిరస్కరించిన న్యాయస్థానం మళ్లీ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. వెంటనే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని పంజాబ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ దెబ్బతో ఇంత కాలం తప్పించుకు తిరుగుతున్న అమ్మడు దెబ్బకు దెయ్యం దిగిందని అనట్లు నేరుగా వచ్చి కోర్టులో లొంగిపోయింది. ఇక ముందు కొర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరౌతానని, తప్పించుకుని తిరగనని రాఖీ సావంత్ బుద్దిగా సమాధానం చెప్పడంతో కోర్టు ఆమెకు జామీను మంజూరు చేసింది.

పోలీసులు అరెస్టు చేస్తే బెయిల్ ఇవ్వరని తెలుసుకున్న రాఖీ సావంత్ తనను ఎవ్వరూ గుర్తు పట్టకూడదని ప్లాన్ వేసి బుర్కా వేసుకుని ఓ మామూలు ట్యాక్సీలో తన న్యాయవాదితో కలిసి లూథియాన కోర్టుకు వచ్చి లొంగిపోయింది. ఇక ముందు కోర్టు విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశిస్తూ లక్ష రూపాయల పూచికత్తుతో రాఖీ సావంత్ కు జామీను మంజూరు చేసింది.