రకుల్ కు అలాంటి మగాడు కావాలట..

0టాలీవుడ్ ఇండస్ట్రీ లో అతి తక్కువ టైం లో అగ్ర హీరోయిన్ స్థాయి కి చేరుకున్న రకుల్ ప్రీతీ సింగ్..తాజాగా తనకు ఎలాంటి మగాడు మొగుడు కావాలో తెలియజేసింది. తన హైట్ 5. 9 కాబట్టి నాకంటే హైట్ ఉన్న మగాడు అంటే ఆరడుగులు ఉన్నవాడు కావాలని అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. గతం లో కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన ఈ భామ , తాజాగా మరోసారి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది .

గత ఏడాది స్పైడర్ తర్వాత తెలుగు లో మరో మూవీ కి సైన్ చేయలేదు ఈమె..ప్రస్తుతం ఈమె ఫోకస్ అంత బాలీవుడ్ పైనే పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మధ్యనే బాలీవుడ్ లో అయ్యారీ మూవీ లో నటించింది కానీ ఆ మూవీ రకుల్ కు చేదు అనుభవమే మిగిల్చింది. ప్రస్తుతం ఈమె తమిళ్ లో సూర్య , కార్తీక్ ల సరసన నటిస్తుంది.