రకుల్‌ కొత్త లవ్‌

0Rakul-owns-a-New-Benzప్రస్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన గ్యారెజ్‌లో కొత్తగా మరో కారును చేర్చింది. తాజాగా రకుల్‌ మెర్సిడెస్‌ బెంజ్‌ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ.. ‘నా కొత్త లవ్‌’ అనే క్యాప్షన్‌తో ఫొటో షేర్‌ చేసింది. రకుల్‌ ప్రస్తుతం ఆడీ క్యూ4 కారును వాడుతోంది. ప్రస్తుతం రకుల్‌ హిందీలో ‘అయారీ’, తమిళంలో ‘థీరన్‌ అధిగరం ఒండ్రు’ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె మహేశ్‌కు జోడీగా నటించిన ‘స్పైడర్‌’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.