రకుల్ ఖాతాలో మరో హీరో

0Rakul-Preet-Singh-Third1రకుల్ ప్రీత్ సింగ్ జోరు ఈ మధ్య కాస్త తగ్గింది. వరుసగా పెద్ద సినిమాలతో అలరించింది రకుల్. ఎన్టీఆర్ , మహేష్ , బన్నీ , రామ్ చరణ్ ఇలా బడా స్టార్స్ తో జతకట్టేసింది. ఐతే ఈ మధ్య ఆమె కెరీర్ కాస్త డ్రాప్ అయినట్లు కనిపించింది. కానీ బాలీవుడ్ కి వెళ్ళింది ఈ భామ. బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘అయ్యారి’ ఫిబ్రవరి 16న విడుదలై కాస్త నిరాశ పరిచింది. దీంతో పాటు ఆమె పాత్రకు కూడా పెద్ద పేరు రాలేదు.

అయితే ఇప్పుడీ భామ ఓ తమిళ సినిమా దక్కించుకుంది. తమిళ స్టార్‌ శివ కార్తికేయన్‌ హీరోగా ఆర్‌. రవికుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను తీసుకున్నట్లు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.ఇదే జరిగితే శివ కార్తికేయన్‌ తో ఆమెకు ఇదే మొదటి సినిమా అవుతుంది .