చిట్టిపొట్టి డ్రెస్సులతో హీరోయిన్ల పార్టీలు

0సినిమా కెరీర్ను తెలుగులో సులువుగా ఆరంభించేసి కాస్త ఫేమ్ వచ్చాక ఆ తెలుగు ఇండస్ట్రీనే తిట్టిన భామ తాప్సీ పన్ను. తెలుగు సినిమాల ద్వారానే బాలీవుడ్ కి పరిచయమై అక్కడ సినిమాలు దక్కించుకుంది. వార్తల్లో రావడం కోసమో లేక బాలీవుడే గొప్ప అని చెప్పడం కోసమో తెలియదు కానీ టీవీఛానెల్లో తెలుగు దర్శకులను తెలుగు పద్దతులను తెగ తిట్టిపోసింది. తెలుగు ఇండస్ట్రీ ఇచ్చిన సినీ జీవితంలో ముంబైలో పార్టీలు చేసుకుంటోంది. ఇప్పుడామెకు రకుల్ ప్రీత్ కూడా తోడైంది.

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది తాప్సీ. తొలి సినిమానే రాఘవేంద్రుడి సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో కొన్నాళ్లు తెలుగులో బండి బాగానే సాగింది. ఆ సమయంలో అమ్మడు నోరు విప్పి ఒక్క విమర్శ చేయలేదు. తరువాత అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ అవకాశాలు దక్కించుకుని అక్కడికి వెళ్లిపోయింది. చేతిలోకి సినిమాలు రాగానే కళ్లు నెత్తికెక్కిపోయాయి. జీవితాన్నిచ్చిన తెలుగు ఇండస్ట్రీపైనా రాఘవేంద్రుడిపై చీప్ కామెంట్స్ చేసింది. హీరోయిన్ ను కేవలం సెక్సీ ఇమేజ్ కోసమే ఉపయోగించుకుంటారని కామెంట్ చేసింది. ఆ కామెంట్తో తెలుగు సినీ జనాలకు చిర్రెత్తుకొచ్చింది. మరిప్పుడు ముంబైలో అర్థరాత్రి పార్టీల్లో రెచ్చగొట్టే చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని తిరుగుతోంది తాప్సీ. అది మాత్రం సెక్సీ ఇమేజ్ కోసం కాదా? ఆమెకు జతగా చేరింది రకుల్ ప్రీత్ సింగ్.

తెలుగులో అవకాశాలు తగ్గడంతో రకుల్ కూడా బాలీవుడ్ సినిమాలపై దృష్టిపెడుతోంది. ఇప్పటికే అయ్యారి సినిమాలో నటించింది. ఆ సినిమా పెద్దగా పేరు తెచ్చుకోలేదు. దీంతో మరిన్ని అవకాశాల కోసం చూస్తోంది. ముంబై తాప్సీ- రకుల్ కలిసి నైట్ పార్టీలతో బిజీగా ఉన్నారు. కాకపోతే రకుల్ ఇంకా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏమీ కామెంట్ చేయలేదు. పైగా క్యాస్టింగ్ కౌచ్ లేదంటూ చెప్పి టాలీవుడ్ కు మద్దతిచ్చింది. తాప్సీ స్నేహం వల్ల రాబోయే రోజుల్లో ఏమన్నా మాట్లాడుతుందేమో చూడాలి.