వీధుల్లో క్యాట్ వాక్ చేస్తే 10కె గిఫ్ట్!

0

బాలీవుడ్ లో సోనమ్ కపూర్ – సౌత్ ఇండస్ట్రీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ .. ఈ ఇద్దరి మధ్యా ఓ సారూప్యత ఉంది. ఈ ఇద్దరూ మాంచి ఫిట్ నెస్ ఫ్రీక్స్.. అంతకుమించి ఫ్యాషన్ ప్రేమికులు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏదైనా వచ్చిందంటే చాలు వెంటనే దానిని ఫాలో చేసేస్తారు. యూత్ కి పరిచయం చేసేస్తారు. ప్యారిస్ కే ఒణుకు పుట్టించే నవలా కాంతలు ఈ భామలు.

తాజాగా రకుల్ ప్రీత్ ఓ డిఫరెంట్ ఫ్యాషన్ కాంటెస్ట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. “వీధుల్లో క్యాట్ వాక్ చేయ్.. 10కె గెలుచుకో!“ అన్నదే ఆ కాన్సెప్టు సారాంశం. వీధుల్లో మీరు సహజంగా ఎలా నడుస్తారో అలానే నడవండి. ఆ నడకలకు సంబంధించిన ఫోటోలు – వీడియోల్ని నాకు షేర్ చేయండి. ప్రతి వీధిలోనూ అలా షికారు చేస్తూ ఆ ఫోటో దిగి పంపిస్తే చాలు రూ.10వేల బహుమతి గెలుచుకునే ఛాన్సుంది“ అంటూ ఊరించేస్తోంది. ఇదంతా ఓ ఫ్యాషన్ బ్రాండ్ కి రకుల్ చేస్తున్న ప్రచారం అనుకోవచ్చు.

రకుల్ ప్రస్తుతం తమిళంలో కార్తీ సూర్య వంటి అగ్ర కథానాయకుల సరసన నటిస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్ లో క్రేజు తగ్గగానే – అటు తమిళంలో అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంది. మరోవైపు బాలీవుడ్ లోనూ ఓ సినిమాకి సంతకం చేసిన సంగతి తెలిసిందే. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` చిత్రంతో హిట్టందుకుని దూకుడు పెంచిన రకుల్ మహేష్ – ఎన్టీఆర్ – అల్లు అర్జున్ – చరణ్ – రవితేజ – నాగచైతన్య లాంటి స్టార్ల సరసన నటించింది. తక్కువ టైమ్ లో ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్నా – ఎందుకనో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఖంగు తింది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో చేస్తోందన్న ప్రచారం అయితే సాగుతోంది.
Please Read Disclaimer