తాను నటించిన హీరోలపై రకుల్ ప్రీత్ సింగ్ వన్ వర్డ్ కామెంట్

0తెలుగులో స్పైడర్ తర్వాత కనిపించకుండా పోయిన రకుల్ ప్రీత్ సింగ్ తమిళం మరియు హిందీల్లో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. తెలుగు నుండి అవకాశాలు వస్తున్నాయో రావడం లేదో తెలియదు కాని అక్కడ మాత్రం రకుల్ చాలా బిజీగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. తెలుగు సినిమా తనకు స్టార్డం తెచ్చి పెట్టిందని చెబుతున్న రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ తెలుగులో బిజీ అవ్వాలని కోరుకుంటుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత తెలుగులో కొత్త సినిమాలు చేస్తాను అంటూ చెబుతోంది.

తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన సినీ కెరీర్ గురించి తాను ఇప్పటి వరకు నటించిన హీరోల గురించి పలు వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. కెరీర్ ఆరంభం నుండి ఇప్పటి వరకు నటించిన హీరోల గురించి ఒక్క వర్డ్లో రకుల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చూద్దాం..

సందీప్ కిషన్ : మొదటి హీరో – మంచి స్నేహితుడు
రామ్ : చాలా ఎనర్జిటిక్ హీరో
గోపీచంద్ : మంచి మనసున్న వ్యక్తి
రవితేజ : టాలెంట్ కు పవర్ హౌస్
రామ్ చరణ్ : చిన్నపిల్లాడి మనస్థత్వం కలిగిన మంచి వ్యక్తి
తారక్ : సినిమా పరిశ్రమకు వరం – గొప్ప డాన్సర్
అల్లు అర్జున్ : ఇండస్ట్రీని మరోస్థాయికి తీసుకు వెళ్లగల సత్తా ఉన్న స్టార్
సాయిధరమ్ తేజ్ : నిజాయితీతో వర్క్ చేసే వ్యక్తి
మహేష్ బాబు : సినిమాపై ఫ్యాషన్ ఉన్న హీరో
బెల్లంకొండ శ్రీనివాస్ : దేనైనా కొత్తగా ఆలోచించి ప్రయత్నించే తత్వం.