‘ఎన్టీఆర్’ లో శ్రీదేవి పాత్రపై రకుల్ ఫుల్ క్లారిటీ

0ఎన్టీ రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ చిత్రంను క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నిర్మిస్తూ నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంలో పలువురు స్టార్స్ కనిపించబోతున్న విషయం తెల్సిందే. చంద్రబాబు నాయుడు పాత్రలో రానా – హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ – ఎస్వీ రంగారావు పాత్రలో నాగబాబు ఇంకా కైకాల సత్యనారాయణలతో పాటు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సమయంలోనే ఎన్టీఆర్ తో పలు చిత్రాల్లో నటించిన అతిలోక సుందరి శ్రీదేవి పాత్రను రకుల్ తో వేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

‘ఎన్టీఆర్’ చిత్రంలో శ్రీదేవి పాత్రపై రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ఇచ్చేసింది. ఆ పాత్ర కోసం తనను సంప్రదించిన మాట వాస్తవమే అని కాకుంటే ఇప్పటి వరకు ఆ సినిమా కోసం తాను సైన్ చేయలేదని పేర్కొంది. శ్రీదేవి నా ఫేవరేట్ హీరోయిన్ – ఆమెగా నటించేందుకు తాను ఆసక్తిగా ఉన్నాను. కాని ప్రస్తుతం తమిళంలో పలు చిత్రాలు చేస్తున్న కారణంగా చాలా బిజీగా ఉన్నాను అని ఆ చిత్రాలు పూర్తి అయిన తర్వాత హైదరాబాద్ కు వెళ్లినప్పుడు తాను ఎన్టీఆర్ చిత్ర కథ విని – ఆ తర్వాత ప్రాజెక్ట్ కు సైన్ చేస్తాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

‘ఎన్టీఆర్’ చిత్రంలో శ్రీదేవి పాత్రకు సైన్ చేసిన తర్వాత తప్పకుండా అందరికి అధికారికంగా చెబుతాను అంటూ పేర్కొంది. రకుల్ మాటలను బట్టి చూస్తుంటే ‘ఎన్టీఆర్’ చిత్రంలో శ్రీదేవిగా ఆమెను చూడటం ఖాయంగా కనిపిస్తుంది. శ్రీదేవి పాత్రకు రకుల్ తో చర్చలు జరుపుతున్న చిత్ర యూనిట్ సభ్యులు సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేష్ ను సంప్రదించినట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకు సంబంధించిన క్లారిటీ కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.