స్టైలిష్ పోజిచ్చిన స్లిమ్ము బ్యూటీ

0

రకుల్ ప్రీత్ సింగ్ స్లిమ్ నెస్ పై గత కొంతకాలంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. మరీ అంత స్లిమ్ముగా ఉంటే ఎలా అని కొందరంటారు. అందులో కూడా నిజం లేకపోలేదు. కాస్తయినా ఒంటిపై కండ ఉండాలనేది మన తెలుగు నేటివిటీ. తప్పు పట్టలేం. అలా అని మన నేటివిటీ బాలీవుడ్ కు వెళ్తే పనికి రాదు. దాన్ని పక్కన పెట్టి జీరో సైజ్ మెయింటైన్ చెయ్యాల్సిందే. నిజానికి రకుల్ గతంలో ఇంత స్లిమ్ గా ఉండేది కాదు. ఈమధ్య బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ చేయడంతో కసరత్తులు చేసి మరీ చిక్కిపోయింది.

అయితే ఇక్కడ చిక్కేమిటంటే నమిత లాంటి బొద్దు భామలను ఆరాధించే కళ్ళతో స్లిమ్ము రకుల్ ను చూస్తే.. రకుల్ మనకు నచ్చే అవకాశం లేదు. అయినా మన తెలుగులోనే చక్కనమ్మ చిక్కినా అందమే అని సామెత ఉంది కదా. అలా మనం సరిపెట్టుకోవాల్సిందే. తాజాగా రకుల్ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తన లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’ సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా రెడీ అయ్యానని క్యాప్షన్ ఇచ్చింది. పర్పుల్ కలర్ టాప్ అదే కలర్ ప్యాంట్ ధరించి యమా స్టైలిష్ గా పోజిచ్చింది. ప్యాంట్ బెల్ బాటం మోడల్ లో ఉండడంతో డ్రెస్ డిఫరెంట్ గా ఉంది.

బ్రౌన్ షేడ్ ఉన్న హెయిర్.. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్.. చేతికి బ్రేస్ లెట్ తో అల్ట్రా స్టైలిష్ మోడల్ లాగా కనిపించింది. సడెన్ గా చూస్తే జపాన్ అమ్మాయిలా అనిపిస్తోంది. ఈ ఫోటోలు నెటిజనులకు తెగ నచ్చాయి. పోస్ట్ చేసిన మూడు గంటల్లోనే మూడున్నర లక్షల లైక్స్ వచ్చాయి. కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి కానీ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే “బెస్ట్ ఇస్మాయిల్”. అర్థం అయింది కదా స్మైల్ సూపర్ అంట. స్లిమ్ము పైగా స్మైల్ సూపర్.. అందుకేగా ఈ భామను ‘మన్మథుడు 2’ లో నాగ్ కు జోడీగా ఎంపిక చేసింది!