రకుల్ కు పిలిచి మరీ ఇచ్చిన మహేష్

0‘భరత్ అనే నేను’ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మహేష్ బాబు జోరుమీదున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో గడ్డం పెంచి డిఫెరెంట్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. మహేష్ బాబుకు ఇది 25వ సినిమా.. దిల్ రాజు-అశ్వినీదత్-పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై బోలెడు అంచనాలున్నాయి. ప్రస్తుతం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో భారీ షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్లేందుకు రెడీ అవుతోంది.

అయితే 25వ సినిమా నడుస్తుండగానే మరో సినిమాను కూడా మహేష్ బాబు సిద్ధం చేస్తున్నాడు. తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ తో తీస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.. రంగస్థలం సక్సెస్ తో తెలుగు నేటివిటీ సినిమాలకు కొత్త భాష్యం చెప్పిన సుకుమార్ మహేష్ కోసం ఆసక్తికర కథను సిద్ధం చేశారట.. మహేష్ 25వ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ సినిమా మొదలవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సుకుమార్-మహేష్ కాంబినేషన్ రాబోయే సినిమాలో హీరోయిన్ కన్ఫం అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. స్పైడర్ సినిమా లో మహేష్ తో కలిసి నటించిన రకుల్ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో నిరుత్సాహపడింది. ఆ సమయంలోనే మహేష్ బాబు మరో సినిమాలో అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడట.. ఆ ప్రకారం సుకుమార్ సినిమాలో చాన్స్ ఇప్పించాడనే ప్రచారం ఫిలింనగర్ లో జరుగుతోంది. సినిమా మొదలైతే కానీ పూర్తి తారాగణం ఎవరనేది తెలియదు.