వలవేస్తున్న రకుల్

0కొంతమంది ఫోటోల కోసమే పుట్టామన్నట్టుగా అదిపనిగా ఫోటో షూట్స్ లో పాల్గొంటారు. ఆ హాట్ ఘాటు ఫోటోలను సోషల్ మీడియాలోకి వదులుతారు. ఇక రకుల్ ప్రీత్ మాత్రం ఆ కేటగిరీలో లేదు. అంటే ఫోటో షూట్స్ లో పాల్గొనకుండా ఉంటుంది అని కాదు… రేర్ గా ఫోటో షూట్స్ చేస్తుంది.

తాజాగా ఒక ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ నిర్వహించిన ఫోటోషూట్ లో రకుల్ పాల్గొంది. స్టయిల్ గా ఒక పోజిచ్చింది. ఇన్నర్ వేర్ కనిపించేలా పైన బ్లాక్ నెటెడ్ టాప్ ధరించింది. పడుకునే పొజిషన్లో ఎడమ చెయ్యి నేలపై ఆన్చి ఒక హాటు హాటు ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఉంగరం తప్ప ఎలాంటి యాక్సెసరీస్ వేసుకోలేదు. లూజ్ హెయిర్ తో ఒక అల్ట్రా స్టైలిష్ మాడల్ లా కనిపించింది.

ఇక రకుల్ కు ఏం పనిలేక ఇలా ఫోటో షూట్లు మొదలుపెట్టిందని పుసుక్కున అనుకునేరు. బాలీవుడ్ సినిమా ‘దే దే ప్యార్ దే’ తో పాటు తమిళంలో సూర్య ‘NGK’ – #కార్తి17 – శివ కార్తికేయన్ సినిమాలలో నటిస్తోంది. సూర్య – కార్తి సినిమాలు ఎలాగూ రిలీజ్ అవుతాయి. ఇక శివకార్తికేయన్ సినిమా కూడా రిలీజ్ అయితే ఆమె తెలుగు ప్రేక్షకులతో ఫుల్ గా టచ్ లో ఉన్నట్టే!