అచ్చుగుద్దినట్టు శ్రీదేవిలాగే!!

0

క్రిష్ ఎంపిక చేశాడంటే ఇక అంతే! క్లియర్ కట్ గా ఫిక్సయిపోవాల్సిందే. ఆరోజుల్లో కె.వి.రెడ్డి కె.విశ్వనాథ్ – బాలచందర్ – భారతీరాజా .. ఈ రేంజులోనే రాధాకృష్ణ అలియాస్ క్రిష్ కాస్టింగ్ ఎంపికలు సాగుతాయంటే అతిశయోక్తి కాదు. అతడు ఒక పాత్రకు ఒకరిని ఎంపిక చేసుకున్నాడు అంటే వందశాతం పెర్ఫెక్ట్ యాప్ట్ అని ఫిక్సయిపోవాల్సిందే. ఇటీవలే చంద్రబాబు పాత్రకు రానాని – అక్కినేని పాత్రకు సుమంత్ ని ఎంపిక చేసుకున్నప్పుడే వందశాతం పెర్ఫెక్షనిస్ట్ అని ప్రూవైంది. ఆ ఇద్దరూ అంతే ఒదిగిపోయి ఆయా గెటప్పుల్లోకి దూరిపోయి నటించేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ని రెండుగా విభజించి కథానాయకుడు – మహా నాయకుడు అన్న టైటిల్స్ తోనే ఉత్కంఠ పెంచగలిగాడు. యాప్ట్ టైటిల్స్ ని ఈ బయోపిక్ కి ఉపయోగిస్తున్నాడు.

ఎన్టీఆర్ బయోపిక్ లో అతిలోక సుందరి శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్ ని ఎంపిక చేసుకున్నాడు క్రిష్. అయితే రకుల్ ముఖంలో శ్రీదేవి పోలికలు ఉన్నాయా? అని తరచి చూస్తే – ఆ ఇద్దరి ఫోటోల్ని పక్కపక్కనే పెట్టి చూస్తే ఇట్టే తెలిసిపోతోంది. ఆ ముఖ కవళికలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. మేకప్ మాయాజాలంతో ఆ ఇద్దరినీ ఒకేలా చూపించే వెసులుబాటు ఉంది. ఇకపోతే ఆహార్యం – అభినయంలో ఇంచుమించు శ్రీదేవిని తలపించే సత్తా రకుల్ లో ఉండాలంతే. ఆ నడక – నడత – కట్టు – బొట్టు – వ్యవహారికం వీటిలోనే బోలెడంత దిమాక్ ఖరాబ్ చేయొచ్చు. మరి ఆ పని చేస్తుందో లేదో కానీ ఇంతవరకూ వేరొకరికి దక్కని అదృష్టం తనకే దక్కింది. పైనున్న మామ్ రకుల్ నే చూస్తుంటుంది.

అన్నట్టు.. ఒకవేళ రకుల్ ని కాదనుకుని – జాన్వీని కానీ – ఖుషీని కానీ క్రిష్ ఎందుకు తీసుకురాలేదు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకుంటానని బోనీ కపూర్ ని ఎందుకు అడగలేదు? ఇలా పరిపరి విధాలా శ్రీదేవి అభిమానులకు సందేహాలు కలుగుతున్నాయ్. అయితే వీటన్నిటికీ భవిష్యత్ ఇంటర్వ్యూల్లో క్రిష్ సమాధానం చెబుతారేమో చూడాలి.
Please Read Disclaimer