బాయ్ ఫ్రెండ్ ఉంటే రకుల్ అలా చేస్తుందట..

0rakul-preet-singhరకుల్ ప్రీత్ కు ఇప్పటిదాకా బాయ్ ఫ్రెండ్ లేదట. ఐతే ఎప్పుడైనా తనకు బాయ్ ఫ్రెండ్ వస్తే మాత్రం అతణ్ని వెంటనే రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దగ్గరకు ట్రైనింగ్ కోసం పంపిస్తుందట. తనతో ఎలా ఉండాలో.. తనను ఎలా చూసుకోవాలో ప్రకాష్ చాలా బాగా నేర్పిస్తాడని అంటోంది రకుల్. తనను ప్రకాష్ అంత బాగా ఎవరూ అర్థం చేసుకోలేదని అంటోందీ ఢిల్లీ భామ. టాలీవుడ్లో తనకు బెస్ట్ ఫ్రెండ్ ప్రకాషే అని రకుల్ తెలిపింది.

ఈ ప్రపంచంలో తనకు తెలిసిన అత్యుత్తమ వ్యక్తుల్లో ప్రకాష్ కోవెలమూడి ఒకడని.. అతను తనకు క్లోజెస్ట్ ఫ్రెండ్ అని రకుల్ చెప్పింది. తాను హైదరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్లినా ప్రకాష్ ను మిస్సవుతుంటానని ఆమె చెప్పింది. ప్రకాష్ తనను ‘క్లమ్జీ’ అని.. ‘స్మైలీ ఫేస్’ అని.. ఇంకా రకరకాల తమాషా పేర్లతో పిలుస్తుంటాడని.. తనను ఎప్పుడూ నవ్విస్తుంటాడని.. తమ ఇద్దరి మనస్తత్వాలు ఒకేలాఉంటాయని రకుల్ చెప్పింది.

టాలీవుడ్లో తమ ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ అంతా తరచుగా కలుస్తుంటామని.. ఆ సమయంలో ప్రకాష్.. తాను ఒక గ్యాంగ్ అయిపోతుంటామని.. అందరూ సీరియస్ గా ఉంటే ‘మనిద్దరం ఇప్పుడు కామెడీ చేద్దామా’ అంటూ సైగలు చేసుకుంటామని రకుల్ చెప్పింది. ‘‘నాకిప్పుడు బాయ్ ఫ్రెండ్ లేడు. ఫ్యూచర్లో వచ్చినా అతణ్ని ప్రకాష్ దగ్గరికి ట్రైనింగ్ కి పంపిస్తా. అతను పర్ఫెక్ట్ అంటే ఓకే లేదంటే.. బాయ్ ఫ్రెండుని బయటికి పంపించేస్తా’’ అంటూ చమత్కరించింది రకుల్ ప్రీత్.