ఛాన్సుల కోసం రకుల్ బికినీ??

0rakul-preet-singhస్టార్ హీరోలతో నటిస్తే.. హీరోయిన్స్ కెరీర్ లో వచ్చే ఛేంజ్ మామూలుగా ఉండదు. అందుకే బడా హీరోలతో అవకాశాల కోసం హీరోయిన్స్ కాసింత దూకుడు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇతర సినిమాల్లో చూపించిన గ్లామర్ కంటే ఎక్కువగా అందాల విందును పెద్ద సినిమాల్లో పంచేస్తూ ఉంటారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుత రేంజ్ చూస్తే ఆ అవసరం ఉన్నట్లు కనిపించదు.

నాన్నకు ప్రేమతో.. సరైనోడు.. ధృవ.. రా రండోయ్ వేడుక చూద్దాం.. దసరాకు రానున్న స్పైడర్.. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో అలరిస్తోంది రకుల్. మధ్యలో విన్నర్ తో కాసింత డిజప్పాయింట్ అయినా.. జోరు మాత్రం మామూలుగా లేదు. ఈ భామ అందుకునే పారితోషికం ఫిగర్ వింటే మైండ్ బ్లాంక్ అవుతుందని అంటారు. అయితే.. ఏ హీరోయిన్ కు అయినా బాలీవుడ్ లో మెరవడం ఓ డ్రీమ్. అక్కడే మొదలుపెట్టి.. ఇక్కడ వెలుగుతున్న రకుల్ కి.. ఇప్పుడు బాలీవుడ్ లో భారీ ఆఫర్ తలుపు తట్టిందట. ఈ సినిమా కోసం తను పెట్టుకున్న పరిమితులను కూడా సడలించుకుందట రకుల్ ప్రీత్. ఇప్పటివరకూ ఎప్పుడూ కనిపించని స్టైల్ లో దర్శనం ఇవ్వనుందట.

ఇంకా అనౌన్స్ మెంట్ కూడా రాని ఈ ప్రాజెక్టులో భాగం అయ్యేందుకు.. ఓ బికినీ సీన్ తో పాటు.. హీరోతో గాఢమైన లిప్ లాక్ కూడా చేసేందుకు రకుల్ అంగీకరించిందని కథనాలు వస్తున్నాయి. ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ వస్తే తప్ప ఇందులో వాస్తవం ఎంతో తెలిసే ఛాన్స్ లేదు. ప్రస్తుతానికి అయితే.. మహేష్ బాబు మూవీ స్పైడర్ తో టాలీవుడ్ లో తనకు స్టార్ స్టేటస్ లభిస్తుందని రకుల్ బోలెడన్ని అంచనాలతో ఉంది.