పవన్ సినిమాకి నో చెప్పిన రకుల్

0Pawan-and-rakulపవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కాటమరాయుడు షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. దీని తర్వాత పవన్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడనే విషయం అభిమానులకు తెలుసు. ఈ సినిమాతో పాటే.. ఏఎం రత్నం నిర్మాణంలో కోలీవుడ్ దర్శకుడు ఆర్టీ నీసన్ తెరకెక్కించే మరో చిత్రం కూడా చేయనున్నాడు పవర్ స్టార్.

ఈ మూవీలో పవన్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు ఖాయం అనుకున్నారు. కానీ ఇప్పుడా ఆఫర్ ని రకుల్ రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇందుకు కారణం.. స్క్రిప్ట్ లాంటివేమీ కాదు. పవన్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరలేదట. ప్రస్తుతం మహేష్ బాబు-మురుగదాస్ మూవీలో చేస్తున్న రకుల్ ప్రీత్.. దీంతో పాటే పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది. నాగ చైతన్యతో ఓ మూవీ.. సాయిధరంతేజ్ తో మరో సినిమా.. బెల్లంకొండ శ్రీనివాస్-బోయపాటి చిత్రాలే కాకుండా.. తెలుగు-తమిళ్ బైలింగ్యువల్ కు కూడా రకుల్ సైన్ చేసింది. దీంతో ఈ ఏడాదంతా రకుల్ కేలండర్ ఫుల్ అయిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో పవన్ మూవీకి డేట్స్ ఎడ్జస్ట్ చేయడం రకుల్ కి సాధ్యం కాలేదట. దీంతో ఇతర లీడింగ్ హీరోయిన్స్ వైపు చూస్తున్నాడు నిర్మాత ఏఎం రత్నం. మరోవైపు.. ఈ మూవీలో హీరో చెల్లెలి పాత్రకు కూడా ఓ యంగ్ బ్యూటీని ఎంపిక చేయాల్సి ఉంటుంది.