బ్రైడల్ డిజైన్ లో రీల్ శ్రీదేవి

0

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు మాత్రమే కాదు గ్లామరస్ ఫోటో షూట్లు చేస్తూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా వెడ్డింగ్ వోస్ అనే మ్యాగజైన్ నవంబర్ ఇష్యూ కవర్ పేజీ కోసం ఒక ఫోటో షూట్ చేసింది. పెళ్ళి ప్రమాణాలు అని మ్యాగజైన్ పేరే ఉంది కదా దీంతో ఒక ముచ్చటైన మోడరన్ పెళ్ళి డ్రెస్ లో మెరిసింది.

ఈ డ్రెస్ ను నీతా లుల్లా డిజైన్ చేయగా రకుల్ కు స్టైలింగ్ చేసింది నేహ గోద్వాని. స్లీవ్స్ తో పాటు ఫ్రంట్ మిల్కీ వైట్ కలర్ క్లాత్ పఫ్ఫీ డిజైన్ తో డ్రెస్ మాత్రం బ్యూటిఫుల్ గా ఉంది. ఇక డ్రెస్ కు వేలాడే దారాలు కూడా ఒక డిఫరెంట్ లుక్ ని తీసుకొచ్చాయి. లార్జ్ ఇయర్ రింగ్స్ తో పాటుగా మ్యాచింగ్ ఉంగరంతో స్టైలింగ్ కంప్లీట్ గా ఉంది. రకుల్ సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకునేదే. ఏమాత్రం ఎబ్బెట్టుగా లేకుండా డిఫరెంట్ గా బ్రైడల్ వేర్ డిజైన్ చెయ్యడం కత్తిమీద సామే. ఇక అలాంటి డ్రెస్ లో కూల్ గా పోజివ్వడం రకుల్ లాంటి బ్యూటీలకు మాత్రమే సాధ్యమవుతుందేమో. ఈ డ్రస్ లో అచ్చు బుట్టబొమ్మలా ఉంది.

ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో నటిస్తోంది. తెలుగులో వేరే సినిమాలు చేయడం లేదుగానీ తమిళ డబ్బింగ్ సినిమలతో ఏదో ఒక రకంగా తెలుగు ప్రేక్షకులను కవర్ చేస్తోంది. నిన్న రిలీజ్ అయిన కార్తి సినిమాలో ‘దేవ్’ లో రకులే హీరోయిన్.
Please Read Disclaimer