ఆ సినిమా ఛాన్స్ రకుల్ కొట్టేసిందా?

0Rakul-Preet-Singh-To-Pair-with-pawanరకుల్ ప్రీత్ సింగ్ టైం ఇప్పుడు మామూలుగా లేదు. గతేడాది నాన్నకు ప్రేమతో నుంచి.. ఈ భామ వరుసగా సక్సెస్ లు కొట్టేస్తూ దూసుకుపోతోంది. మధ్యలో విన్నర్ మూవీ విజేతగా నిలవలేకపోయినా.. ఈమె జోరు ఏ మాత్రం తగ్గలేదు. సినిమాల కంటే అమ్మడి చేతికి అందుతున్న ప్రాజెక్టులు మరింత హాట్ టాపిక్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో.. అల్లు అర్జున్ తో సరైనోడు.. రామ్ చరణ్ తో ధృవ.. ప్రస్తుతం మహేష్ బాబుతో స్పైర్ అంటూ స్టార్స్ అందరినీ కవర్ చేసేస్తున్న రకుల్ కు.. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ తలుపుతట్టిందని అంటున్నారు.

టాలీవుడ్ టాప్ హీరో ప్లేస్ కు గట్టి కంటెస్టెంట్స్ అయిన పవన్.. మహేష్ లను తక్కువ టైంలోనే కవర్ చేసేసిన హీరోయిన్ గా మారబోతోందట రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న పవర్ స్టార్.. ఆ వెంటనే కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. #PK26గా ఫ్యాన్స్ వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో.. హీరోయిన్ ఆఫర్ ను రకుల్ కు అప్పగించేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది చివరకు షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రంలో.. రకుల్ హీరోియన్ గా నటించడం దాదాపు ఖాయమే అంటున్నారు.

ప్రస్తుతం చేస్తున్న బోయపాటి-బెల్లంకొండ చిత్రం తప్ప వేరే ఏ తెలుగు ప్రాజెక్టును ఒప్పుకోకుండా ఎదురుచూస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కు.. ఆశించిన స్థాయి అవకాశమే చేతికి అందినట్లుగా కనిపిస్తోంది.