‘రోడ్డు మీద’ రకుల్ ఐటెం సాంగ్..

0గత ఏడాది వరకు వరుస అవకాశాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న రకుల్ ప్రీతీ సింగ్..ప్రస్తుతం తెలుగు లో ఒక్క అవకాశం కూడా లేకుండా ఉండిపోయింది. గత ఏడాది స్పైడర్ తర్వాత ఒక్క సినిమా ఛాన్స్ కూడా రాలేదు. ప్రస్తుతం ఈమె తమిళం లో రెండు సినిమాలు చేస్తుంది. అయితే తాజాగా ఈమెకు ఓ ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.

నాగ చైతన్య – చందు మొండేటి కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో సవ్యసాచి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ లో నాగార్జున నటించిన అల్లరి అల్లుడు మూవీ లోని ‘నిన్ను రోడ్ మీద చూసినాను ‘ అనే సాంగ్ ను రీమేక్ చేయబోతున్నారు. ఈ పాట కు గాను రకుల్ ను తీసుకున్నారని సమాచారం. అల్లరి అల్లుడు లో రమ్యకృష్ణ తో చిందులేసిన నాగ్ , ఇప్పుడు చైతు , రకుల్ తో చిందులేయబోతున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ పాట షూట్ ను పూర్తి చేస్తారట.