ఇదిగో.. నాలా కప్పుకోండి అంటున్న రకుల్

0ప్రతీ ఏటా వేసవి అంటేనే భయం కలిగేలా మారుతోంది వాతావరణం . మామూలుగా బయటకు వెళ్ళటానికే భయపడుతున్నారు జనం. బయటికి రావటానికే జంకుతుంటే ఇక అంతటి ఎందలో గంటల తరబడి షూటింగ్ అంటే? మామూలుగా సినీ తారలనగానే చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటాం గానీ కొన్ని సార్లు వాళ్ళుకూడా తట్టుకోలేనంత భాదలని భరించాల్సిందే. ఎండ మాడ్చేస్తూంటే చెమట చికాకు పెడుతున్నా మొహం లో ఎక్స్ప్రెషన్ మారకూడదు.

చలి 2-3 డిగ్రీల దగ్గర ఉన్నా సగం సగం బట్టలతో ఓ సిగ్గుపడి పోవాలి అదీ ఒకటీ రెండు నిమిషాల పనా అంటే కనీసం కొన్ని గంటలు పడుతుంది. ఇదిగో ఇప్పుడు రకుల్ ప్రీత్ పరిస్థితి అదే…. ఇంత వేడిలో షూటింగ్ అంటే ఇంకేముందీ అమ్మడికి చుక్కలు కనిపిస్తున్నట్టున్నాయ్….

ఆ భాదలోనూ ఇదిగో ఇలా ఫోజిచ్చింది.. ఈ ఫోటోను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన రకుల్‌.. 45 డిగ్రీల ఎండలో రేపల్లేలో షూటింగ్‌ చేస్తున్నట్టు చెప్పింది. అంతేకాకుండా ‘విపరీతమైన వేడిలో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఇలా కప్పుకోవాల’ని సలహా కూడా ఇచ్చింది. అదండీ మరి. ఎందనుంచి కాపాడుకోవటానికి ఇలా ఫాలో అయిపోండి మరి.