మహానటి పై చరణ్ కామెంట్స్

0టాలీవుడ్ ఈ ఏడాది అన్ని వర్గాలను అమితంగా ఆకట్టుకున్న సినిమా ఏదైనా ఉందా అని అంటే ఒక మహానటి అనే చెప్పాలి. ప్రతి ఒక్కరి హృదయం వరకు ఈ సినిమా ఎమోషనల్ గా వెళ్లింది. గత కొంత కాలంగా సినిమా గురించి చాలా మంది సినీ ప్రముఖులు కూడా పాజిటివ్ గా కామెంట్ చేశారు. దర్శకుల నుంచి స్టార్ హీరోల వరకు అందరు చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లును కురిపించారు.

ఇకపోతే ప్రస్తుతం ఇంకా సినిమాను చూడని హీరోలు కూడా స్పెషల్ షో వేయించుకొని మరి చూసేస్తున్నారు. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సినిమా చూసేసి పాజిటివ్ కామెంట్స్ అందించారు. సినిమా చాలా బావుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. పూర్తి క్రెడిట్ దర్శకుడు నాగ్ అశ్విన్ కు ఇవ్వాల్సిందే అని సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కీర్తి సురేష్ అలాగే మిగతా నటి నటులు కూడా అద్భుతంగా నటించినట్లు చరణ్ పేర్కొన్నారు.

ఇక స్పెషల్ గా నిర్మాతగా వ్యవహరించిన స్వప్న దత్ – ప్రియాంక దత్ లకు చరణ్ విషెస్ అందించారు. ముఖ్యంగా మెగా హీరోల నుంచి మహానటికి మంచి ప్రశంసలే వచ్చాయి. ఇంతకుకముందు అల్లు అరవంద్ – చిరంజీవి ప్రత్యేకంగా చిత్ర యూనిట్ ని గౌరవించిన సంగతి తెలిసిందే. ఇక మహానటి మంచి కలెక్షన్స్ తో 5వ వారంలోకి అడుగుపెట్టింది.