త్వరలో మెగా మల్టీస్టారర్ రెడీ?

0ram-charan-and-chiruమెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఆయన స్టామినా ఏంటో ఇండస్ట్రీకి ప్రూవ్ చేసింది. పదేళ్ల సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత సినిమా వచ్చినా చిరు రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని ఖైదీ నంబర్ 150 నిరూపించింది. మరోవైపు రామ్ చరణ్ కూడా ధృవ మూవీతో ట్రాక్ లోకి వచ్చాడు. ఏ ఏరియాలోను పరిస్థితులు అనుకూలంగా లేని టైమ్ లో తిరుగులేని సక్సెస్ సాధించాడు.

తండ్రీ కొడుకులు ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర మనీ మెషీన్స్ అయిపోయారు. కొడుకు కంటే చిరు సినిమాకే ప్రేక్షకుల నుంచి ఆదరణ ఎక్కువ లభిస్తోందనే వాస్తవం ఒప్పుకోవాల్సిందే. అయితే.. ఖైదీ నంబర్ 150లో మెగా పవర్ స్టార్ కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపించినా.. ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. దీన్ని గమనించిన మెగా టీమ్.. చిరు-చెర్రీల కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. రెండు తరాల యాక్టర్లు కలిసి నటించే సినిమాలకు టాలీవుడ్ లో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఇప్పుడు చిరు-చెర్రీల కాంబినేషన్ కోసం స్టోరీ వెతకడం ప్రారంభించారట.

ధృవ మూవీ కోసం మేకోవర్ చేసి.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సక్సెస్ సాధించాడు చెర్రీ. మరోవైపు మెగాస్టార్ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ మూవీనే మెసేజ్ ఓరియెంటెడ్ గా తీసి ఘనవిజయం సాధించేశారు. వీరిద్దరూ కలిసి నటించే సినిమా అంటేనే.. మెగాభిమానుల్లోనే కాదు.. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తి కలుగుతోంది. మరి ఈ ప్రాజెక్ట్ సాకారం అయితే మాత్రం.. టాలీవుడ్ లో కొత్త రికార్డులకు బీజం పడ్డట్లే.