మెగాస్టార్ తో మెగా హీరోయిన్

0Ram-Charan-And-Rambha-Guests-for-Meelo-Evaru-Kottiswarudu-Showమెగాస్టార్ చిరంజీవి.. రంభ.. కొన్నేళ్ల క్రితం ఈ కాంబినేషన్ కేక. హిట్లర్ మూవీ నుంచి మొదలుపెట్టి బావగారూ బాగున్నారా.. ఇద్దరు మిత్రులు వంటి పలు చిత్రాలకు ఇద్దరూ కలిసి డ్యాన్సులు ఇరగదీసేశారు. పెళ్లి చేసుకుని సెటిల్ అయిన ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో విడాకులకు సంబంధించిన వివాదాల్లోనే ఎక్కువగా వార్తల్లో నానుతోంది.

ఇప్పుడు మెగాస్టార్ నిర్వహిస్తున్న టెలివిజన్ షో.. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది రంభ. ఎవరితో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చిందో తెలుసా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఎంఈకేలో పాల్గొంది రంభ. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. మాస్ రగ్గడ్ లుక్ లో రామ్ చరణ్.. 40 ఏళ్ల వయసులోనూ మిలమిల్లాడుతున్న రంభ.. హోస్ట్ అవతారంలో స్టైల్ గా చిరంజీవి.. కాంబినేషన్ అద్దిరిపోయిందంతే.

ఈ స్టిల్ లో రంభను చూస్తుంటే.. ఇప్పటికీ హీరోయిన్ గా నటించేసే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు చెర్రీ లుక్స్ అయితే అదరహో అనాల్సిందే. ఇప్పటివరకూ ఒకట్రెండు ఫోటోల్లో చూసినా.. సుకుమార్ మూవీలో చెర్రీ లేటెస్ట్ లుక్ పూర్తిగా తెలిసింది మాత్రం ఇప్పుడే. ధృవ లాంటి క్లాస్ మూవీ తర్వాత.. మెగా పవర్ స్టార్ ఇప్పుడు మాస్ అవతారంలో ఇరగదీయడం ఖాయంగా కనిపిస్తోంది.