రామ్ చరణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్

0రామ్ చరణ్ కొత్త సినిమా మొదలైపోయింది. ధృవ సక్సెస్ తర్వాత సుకుమార్ తో చేయనున్న సినిమా.. ఇవాల్టి నుంచే షూటింగ్ ప్రారంభం అయింది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారు.

ఈ సినిమా పక్కా పల్లెటూరి వాతావరణంతో తెరకెక్కిస్తున్నారనే విషయం ఇప్పటికే చెప్పేసుకున్నాం. ఆ విషయాన్ని రివీల్ చేయడానికి.. చరణ్ కి సంబంధించిన ప్రీ లుక్ తో ఓ పోస్టర్ ను రిలీజ్ చేశాడు సుకుమార్. ఓ పల్లెటూళ్లో.. రెండు బిందెలను కావడిలో మోస్తున్న హీరో లుక్.. స్కెచ్ రూపంలో మనకు కనిపిస్తుందంతే. అయితే.. మెగా పవర్ స్టార్ ఇలాంటి సో సింపుల్ రోల్ కనిపించడం అంటే చిన్న విషయం కాదు. గతంలో గోవిందుడు అందిరవాడే చిత్రంలో కూడా ఇలా పల్లెటూరి వాతావరణంలో రూపొందినా.. అందులో లండన్ నుంచి వచ్చిన పోష్ కేరక్టర్.

కానీ సుకుమార్ సినిమాలో మాత్రం.. పక్కా పల్లెటూరి కుర్రాడిగా చరణ్ కనిపించనున్నాడు. చరణ్ తో ఇలా కావడి మోయించే రోల్ చేయిస్తున్న సుకుమార్ ని అప్రిషియేట్ చేయాల్సిందే. పీరియాడికల్ మూవీ అనే టాక్ కూడా ఉంది కానీ.. దానిపై అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ లేదు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.Ram Charan Movie First Look Poster