చరణ్ ఉపాసనల మెగా బాండింగ్

0అనుకుంటాం కానీ సినిమా తారలకున్న బిజీ లైఫ్ లో వాళ్ళ కుటుంబ సభ్యులతో క్వాలిటీ టైం స్పెండ్ చేయటం అంటే అంత ఈజీ కాదు. అందులోనూ స్టార్ హీరోల పరిస్థితి మరీ కష్టంగా ఉంటుంది. అందుకే మహేష్ బాబు లాంటి హీరోలు ప్రతి సంవత్సరం విడిగా విదేశీ టూర్లు ప్లాన్ చేసుకుని మరీ సెలవు తీసుకుంటారు. గత ఏడాది భరత్ అనే నేను షూటింగ్ ఒత్తిడి వల్ల అది కూడా మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక రామ్ చరణ్ ఈ విషయంలో తన ప్రత్యేకతను మరోరకంగా చాటుకున్నాడు. ఒక పక్క సినిమాలతో పాటు కొణిదెల ప్రొడక్షన్ సంస్థ వ్యవహారాలు మరోపక్క అభిమానులతో తరచు సమావేశాలు ఇలా గ్యాప్ లేకుండా రామ్ చరణ్ వరస బిజీ షెడ్యూల్స్ తో ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఉంటాడు. మరి ఇంత టైట్ ఉండే డైరీలో అపోలో వ్యవహారాలు చూసుకునే భార్య ఉపాసనతో సమయం గడపడానికి వీలు చిక్కుతుందా అనే అనుమానం కలగడం సహజం. వాటికి క్లారిటీ ఇవ్వడానికి ఉపాసన ఈ రోజు పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

అపోలో స్టూడియోలో ఉపాసన చేపట్టిన 7 రోజుల ట్రాన్స్ ఫర్మేషన్ ప్రోగ్రాం కోసం కష్టపడుతుంటే తనను మోటివేట్ చేసేందుకు రామ్ చరణ్ కూడా వ్యక్తిగతంగా అక్కడే ఉండి తనతో సమానంగా ఎక్స్ సర్సైజ్ లతో పాటు వర్క్ ఔట్స్ చేయటం చూస్తే ముచ్చటేయక మానదు. భార్యకు ప్రేమను పంచడం అంటే కేవలం బాధ్యతలు మోయడం మాత్రమే కాదని తన లక్ష్యాల పట్ల నడిపించేలా తోడుండటం అని ప్రూవ్ చేసిన రామ్ చరణ్ మీద ప్రశంశల వర్షం కురుస్తోంది. ఊపిరి సలపని పనుల మధ్య ఇలా ప్రత్యేకంగా ఉపాసన కోసం రామ్ చరణ్ జిమ్ లో అంత కష్టపడటం చూసి చిట్టిబాబు ప్రేమ గట్టిదే అంటున్నారు అభిమానులు. ఇదంతా సరేకాని బుల్లి రామ్ చరణ్ వచ్చే శుభవార్త గురించి మాత్రం కనీసం ప్రస్తావన కూడా తేవడం లేదు మెగా దంపతులు. చూస్తుంటే మరో రెండు మూడేళ్లు మనవడో మనవరాలో ఆడుకోవడానికి చిరంజీవిని ఇంకో రెండు మూడేళ్లు వెయిట్ చేయించేలా ఉన్నారు. అప్పటి దాకా ఈ వీడియోలు ఫొటోలతో కాలక్షేపం చేయటమే.