చెర్రీ నాటకాలాడుతున్నాడట!

0టాలీవుడ్ లోని క్యూట్ కపుల్స్ లో రామ్ చరణ్ – ఉపాసన ఒకరు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మిస్టర్ సీ గురించి ఉపాసన…సోషల్ మీడియాలో ఎప్పటికపుడు అప్ డేట్స్ ఇస్తుంటారు. షూటింగ్ ల నుంచి కాస్త విరామం దొరికినా….ఉపాసనతో టైం స్పెండ్ చేస్తుంటాడు చెర్రీ. తాజాగా చెర్రీకి ఉపాసన ఓ కాంప్లిమెంట్ ఇస్తూ…తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. మిస్టర్ సీ చాలా కష్టమైన వ్యక్తిగత ట్రైనర్ అని….కామెంట్ పెట్టారు. అంతకుముందు రాత్రి బాగా తిన్నందుకు…పట్టుబట్టి మరీ తనతో వ్యాయామం చేయించారని ఫన్నీగా చెప్పారు. తనపై తానే జాలిపడుతూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ క్యూట్ కపుల్ ఇద్దరూ కలిసి ఓ స్వీట్ డిష్ ఆర్డర్ ఇచ్చారట. ఉపాసనతో కలిసి ఉన్న చెర్రీ…. ఆ డిష్ పై ఓ లిక్విడ్ వేస్తూ తినేవాడిలా తెగ బిల్డప్ ఇచ్చాడు. అయితే డైట్ లో భాగంగా చెర్రీ ఆ ఐటమ్ తినలేదట. ఆ డిష్ తానే తిన్నానని కానీ తింటున్నట్లు నటించిన చెర్రీ అసలు రుచి కూడా చూడలేదని ఉపాసన చెప్పారు. ఈ నటనకు చెర్రీకి అవార్డు ఇవ్వొచ్చని – ఆయన డ్రామా చేస్తున్నారని చెప్పారు. ఆ డిష్ మొత్తం తానే తిన్నందుకు జిమ్ లో మిస్టర్ సీ ట్రైనింగ్ కు బలయ్యానని చెప్పారు. నిన్ని రాత్రి తిన్నందుకు ఇపుడు మూల్యం చెల్లిస్తున్నానంటూ వ్యాయామం చేస్తోన్న వీడియోను ఫన్నీగా పోస్ట్ చేశారు. కాగా బోయపాటి దర్శకత్వంలో రాం చరణ్ నటిస్తోన్న చిత్రం షెడ్యూల్ మంగళవారం యూరప్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.