ఆలయంలో సింపుల్ గా చెర్రీ

0Ram-Charan-at-Domakonda-templeరామ్ చరణ్ లో భక్తి భావం ఎక్కువ. తన భార్య ఉపాసనతో కలిసి తరచుగా పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తుంటారు. వీళ్లు ఎక్కువగా వెళ్లేది నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ సంస్థానంలోని దేవాలయానికి. ఉపాసన కుటుంబం ఆ సంస్థానానికి అధిపతులుగా పనిచేశారు. తన మామ కుటుంబానికి చెందిన ఆ కోటలోని దేవాలయానికి వెళ్లి ప్రత్యేకంగా పూజలు జరిపి వస్తుంటాడు రామ్ చరణ్.

ఇటీవల మరోసారి అక్కడికి వెళ్లారు. తెల్లటి చొక్కా – లుంగీ కట్టుకొని ఒక కామన్ మేన్ లాగా ఆయన ఆ దేవాలయంలో కనిపించారు. పూజారులతో కలిసి ఫొటోలు దిగారు. ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ కథానాయకుడిగా ఏ స్థాయికి వెళ్లినా ఆయన సింపుల్ గా ఉండటానికే ఇష్టపడతారు. ఆయన సింప్లిసిటీ ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తుంటే తెలియడం లేదూ! ప్రస్తుతం చెర్రీ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అలాగే తన తండ్రి నటిస్తున్న `సైరా`కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.