షాక్… రామ్‌ చరణ్, బోయ‌పాటి మూవీ యాక్ష‌న్ సీన్స్ లీక్..!

0

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల విదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వైజాగ్ చేరుకుంది. ఈ సందర్భంగా రామ్‌చరణ్, బోయపాటి శ్రీను, నిర్మాత డీవీవీ దానయ్యలు సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సింహాచలం ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని కప్ప స్తంభానికి ఆలింగనం చేసుకున్నారు. పుజానంతరం ఆలయ అధికారులు స్వామికి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. ఈ సినిమాలో చ‌ర‌ణ్‌ సరసన కైరా అద్వానీ నటిస్తోంది. అయితే… ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తున్నాయి. ఇందులో చరణ్ కత్తి పట్టుకుని ఫైట్ చేస్తున్నాడు. ఈ ఫోటోలు లీక‌వ్వ‌డంతో చిత్ర యూనిట్ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌.

తాజా షెడ్యూల్ కాకుండా మ‌రో షెడ్యూల్ కూడా ఉంద‌ట‌. సంక్రాంతికి రిలీజ్ కాబ‌ట్టి ఇంకా టైమ్ ఉంది కానీ… బోయ‌పాటి మాత్రం షూటింగ్ లేట్ అవుతుండ‌టంతో టెన్ష‌న్ ప‌డుతున్నార‌ని తెలిసింది. సంక్రాంతికి రానున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Please Read Disclaimer