మెగా పవర్ స్టార్ మామ డ్యూటీలు

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ #RC12 షూటింగ్ తాజా షెడ్యూల్ అజర్ బైజాన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చరణ్ హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. మరి హైదరాబాద్ రాగానే మామ డ్యూటీలు చేయడం మొదలు పెట్టాడట. ఇది మేము చెప్పడం కాదు బాబోయ్.. చరణ్ వైఫ్ ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలిపింది.

చుట్టూ పిల్లలు ఉన్నారు.. ఒక పాపతో దగ్గరుండి మరీ కేక్ కట్ చేయిస్తున్నాడు చరణ్. బోయపాటి యాక్షన్ ఎపిసోడ్ల హీట్ ను తగ్గించుకునేందుకు ఇలా పిల్లలతో గడుపుతూ చిన్న పిల్లాడిలా మారిపోయాడేమో. ఈ ఫోటో ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఉపాసన ‘మామ డ్యూటీస్… హ్యాపీ బర్త్ డే’ అని ట్వీట్ చేసింది. ఇక ఈ ఫోటోలో అల్లు అయాన్ కేక్ కటింగ్ తతంగాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు.

మరి పుట్టినరోజు జరుపుకుంటున్న పాప డీటెయిల్స్ ను ఉపాసన వెల్లడించలేదు గానీ ఈ ఫోటోకు సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగా మామా మజాకా అని చెర్రీ అభిమానులు సంబరపడుతున్నారు. మరి ఈ మెగామామను బోయపాటి బాయాయి ఎలా చూపించాడో ఏంటో సంక్రాంతికి గానీ తెలియదు.
Please Read Disclaimer