అబ్బా.. డిజప్పాయింట్ అయ్యారట!

0

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన #RC12 ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిర్మాతలు నిన్నే రిలీజ్ చేశారు. రామ్ చరణ్ ఫుల్ మాస్ అవతారంలో రఫ్ అండ్ టఫ్ లుక్ లో ఫ్యాన్స్ ను థ్రిల్ చేశాడు గానీ కొంతమంది మాత్రం బోయపాటి శ్రీను తీరుపై రుసరుసలాడుతున్నారట. ఫస్ట్ లుక్ బాగుంది కదా.. మరి వాళ్ళకేం నచ్చలేదు?

వాళ్ళు చెప్పే మొదటి పాయింట్ ఏంటంటే టైటిల్ సాఫ్ట్ గా ఉంది ఫస్ట్ లుక్ మాత్రం హార్డ్ గా మాస్ గా ఉంది. టైటిల్ లో ఉన్న వినయ విధేయ రామ్ చరణ్ లుక్ లో ఏమాత్రం రిఫ్లెక్ట్ కాలేదని అంటున్నారు. ఇక మరో పాయింట్ ఏంటంటే చరణ్ ట్రెడిషనల్ లుక్ లో పంచెకట్టు ఉన్న పోస్ట్ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. చాలామంది అలాంటి లుక్కే ఊహించారు. కానీ అలా కాకుండా పండగ పూట ఫుల్ మాస్ లుక్ రిలీజ్ చేయడం ఏం బాగాలేదని కూడా వాళ్ళ కంప్లయింట్. ఇక ఇంతటితో ఆగలేదు.. ‘రంగస్థలం’ సినిమాలో చరణ్ మేకోవర్ ను చూసిన తర్వాత ఇప్పుడు బోయపాటి టచ్ ఉన్న ఈ మేకోవర్ ఏమంత కొత్తగా లేదని కూడా వాళ్ళ పాయింట్.

సరేలెండి.. అన్నీ అందరికీ నచ్చాలని లేదుకదా? విమర్శించే కొంతమంది ఎప్పుడూ ఉంటారు. ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను టీమ్ త్వరలో చరణ్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా టీజర్ ను నవంబర్ 9 న రిలీజ్ చేస్తున్నారు.
Please Read Disclaimer